Wednesday, January 25, 2012

అన్ని సమస్యలకూ పరిష్కారం నిరాహార దీక్ష

అన్ని సమస్యలకూ పరిష్కారం నిరాహార దీక్ష
        అవును! ఇది సత్యం. అన్ని సమస్యలకూ పరిష్కార మార్గం నిరాహార దీక్షలో దొరుకుతుంది. అయితే అది సక్రమంగా వుండాలి. లేకపోతే పరిష్కార మార్గం దొరకదు. సక్రమంగా అంటే ఎలా? నిరాహారదీక్ష చేసేటప్పుడు మౌన వ్రతం కూడా వుండాలి. అంతేకాదు, సమస్య మీద ధ్యాస వుండాలి. సమస్య మీద ధ్యాస అంటే ఏమిటి? సమస్య మీద అంటే .......సమస్య మీదే. సమస్య పరిష్కారం కాదేమో అనే అనుమానం మీద ధ్యాస వుండకూడదు. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని విశ్వాసం మీద కూడా ధ్యాస వుండకూడదు. సమస్య మీదే వుండాలి ధ్యాస.పరిష్కారం కాకపోతే మళ్ళీ ఏమి చెయ్యాలి అనేదాని దాని మీద ధ్యాస వుండకూడదు.ధ్యాస వున్నది అంటే తప్పనిసరిగా ఉచ్చ్వాస నిస్స్వాసాలు అందులో పాలుపంచుకుంటాయి. అవి పలుపంచుకోకపోతే గ్యారంటీగా సమస్యకు పరిష్కారం దొరకదు. అది గుర్తుంచుకుని నిరాహారదీక్ష చేపట్టాలి.
           కొన్ని భారతీయ శాస్త్రాల లెక్కల ప్రకారం ప్రస్తుత కాలమాన ప్రకారం 40 గంటలు  సక్రమంగా సమస్య మీద ధ్యాస పెట్టి నిరాహారదీక్ష చేస్తే సమస్య పరిష్కారం  అవుతుంది. గంట గంటకూ టీ, కాఫీలకు అలవాటు పడినవారు ఏకంగా 40 గంటలు నిరాహారదీక్ష చేపట్టడం కుదురుతుందా? ఆలోచించండి.
---------------------------------------------------------------------------------------------------------
అడగక ముందే సహాయం చేసే వారు దేవతలు 
అడిగితే సహాయం చేసేవారు మానవులు 
అడిగినా సహాయం చేయనివారు రాక్షసులు 
ఏ జాతిలో వుంటారు మీరు? ఆలోచించండి. 


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...