Wednesday, January 25, 2012

కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి?

           ఆ సేతు హిమాచలం మానవాభి వృద్ధిలో మహోజ్జ్వలం 
            మానవాభి వృద్ధిలో 60 వసంతాల గణతంత్ర భారత్ సాధించిన ప్రగతి అనన్య సామాన్యం...... అంటూ చాలా వ్రాసారు. 26 -1 -2010 న ఈనాడు  దినపత్రికలో. అది వారి తప్పుకాదు. అది ఒక వార్త. ప్రచురించారు. అంతే. వార్త వచ్చినందుకే ఆలోచించడానికి అవకాశం.
            ఇంకా వివరాల్లోకి వెళ్ళితే ....... లక్ష మంది ప్రజలకు ఆనాడు 16 మంది వైద్యులు వుండేవారు. ఈనాడు ఆ సంఖ్యా  60 మందికి చేరింది అని వ్రాసారు. ఇది మానవాభి వృద్ధిలో కి వస్తుందా? రాదా? ఆలోచించండి. మేధావుల్లారా! 
             ఆనాడు అంటే 1950 లో 1 ,00 ,000 మందికి 16 మంది డాక్టర్లు. అది ఎక్కువా? తక్కువా? అనేది ఆనాటి జనాభా సంఖ్యను బట్టి చెప్పాలి. అలాగే చెప్పాము అనుకుందాము. మరి వైద్యుల సంఖ్య పెరిగితే ప్రగతా? ప్రజలు ఆరోగ్యంగా వుంటే ప్రగతా? అని ప్రశ్నించుకుంటే ప్రజలు ఆరోగ్యంగా వుంటే ప్రగతి అని అందరూ అంటారు. ఆరోగ్యం అంటే ఏమిటి? (వివరాలు పర్యావరణాన్ని పాడు చేద్దాం రండి అనే బులిటిన్ లో చూడండి )
              కానీ, ప్రజల్లో ఒక భాగమైన డాక్టర్లు కూడా బ్రతకాలి కదా! అందుకే ప్రజలు అనారోగ్యంగా ఉండటమే ప్రగతి అని కొందరు మేధావులు వారి కోసం ప్రజలకు ఎలా జబ్బులు రావాలో కనిపెడుతూ వచ్చారు. అందులో భాగంగా రసాయనిక ఎరువులు కనిపెట్టి, ఉపయోగించి, వ్యవసాయం నేర్పించారు. రైతులకు, మిగిలిన ప్రజలకు అనారోగ్యాలు వచ్చేలా ఆలోచించారు. ఇటు ప్రజలను, అటు భూమాతను అనారోగ్యం పాలు చేసారు.ఆలోచించండి. మేదావుల్లారా! ఇప్పుడు అది కాదు పాయింటు. డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనేది సమస్య? ఎందుకంటే
ప్రతి 6 నెలలకు ఒకసారి (1950 లో) 
          1950 లో 1 ,00 ,000 మందికి 16 డాక్టర్లు వున్నప్పుడు . . . .  ఉదా||కు 1 ,00 ,000 /16 =6 ,250 మంది పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  రోజుకు 8 గం|| ప్రాక్టీసు చేస్తే అందులో గంటకు 4 చొప్పున పరీక్ష చేస్తే 32 మందికి పరీక్ష చేయవచ్చును. ఆ ప్రకారముగా నెలకు 32 x 30 = 960 మందికి అంటే సుమారు నెలకు 1 ,000 మందికి పరీక్ష చేయవచ్చును. ఈ 1 ,000  మంది ప్రతి నెలా పేషంట్ల రూపంలో రాగలరా? రాలేరు. పోనీ, ప్రతి 6 నెలలకు ఒకసారి రాగలరా? వచ్చారు అనుకుందాం. అంటే ఒక్కొక్క డాక్టరుకు 6 ,000 మంది పర్మనెంటు పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ. (ఒక్కొక్క పేషంటు అప్పట్లో 1 రూపాయి యిచ్చినా నెలకు 1000 రూపాయలు ఆదాయం. అంటే 1950 లో ఒక ఐ.ఏ.ఎస్. నెల జీతం (రూ|| 350 /-) కంటే దాదాపు ౩ రెట్లు ఎక్కువ.)  ఈ లెఖ్ఖల ప్రకారం ఎన్ని మెడికల్ కాలేజీలు వుండాలి. ఎంత మంది భవిష్యత్తులో డాక్టర్లు కావాలి అని బడ్జెట్టు వేసుకుని వుంటే ఈనాడు డాక్టర్లు ఎలా బ్రతకాలి అని ఆలోచించాల్సిన పని లేదు. ఆలోచించండి మేధావుల్లారా! ముఖ్యంగా యువతలోని మేధావులు. (వివరాలకు అవసరానికి మించి వుంటే తప్పదు ఆర్ధిక సంక్షోభం బులిటెన్ లో చూడండి)
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo  
-------------------------------------------------------------------------------------------------
ప్రతి 3 నెలలకు ఒకసారి (2010 లో) 
          2010  కి 60  మంది డాక్టర్లు ఉండేలా ప్రగతి సాధించింది అని అంటున్నారు. అంటే మన దేశ జనాభాకు (1 ,30 ,00 ,00 ,000 /1 ,00 ,000 x 60 = 7 ,80 ,000 డాక్టర్లు  వున్నట్లు లెఖ్ఖ. ) అంటే ఉదా||కు 1 ,00 ,000 /60 = 1 ,600  మంది పేషంట్లు  ఒక్కొక్క డాక్టరుకు  వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  (రోజుకు 8 గం|| ప్రాక్టీసు చేస్తే ) 1 ,000 మంది పేషంట్లు కావాలి. ఈ లెక్కన పేషంట్లు కనీసం రెండు నెలలకు ఒకసారి వచ్చి తీరాలి? ఎలా?  . . . జనాభాను పెంచలేరు. ఎందుకంటె, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రవేశ పెట్టిందే డాక్టర్లకు పేషంట్లు రావడానికి కదా! అయితే ఎలా? అని ఆలోచించి కొందరు మేధావులు 1950 నుండి సేంద్రియ వ్యవసాయాన్ని దూరం చేసి, రసాయనిక ఎరువులతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, ఒక వైపు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసారు. మరో వైపు భూసారాన్ని నాశనం చేసారు. ఇంకా రకరకాలుగా ఆరోగ్యాలను చెడగొట్టడానికి పెద్దలకు స్లో పాయిజన్ లాంటి గుట్కాలను, ఆల్కహాల్ ను , పిల్లల మీద రెడి మేడ్ ప్రాసెస్డ్ పేకేజేడ్ ఫుడ్ ను , విష రసాయనాలతో నిండిన బొమ్మలను (వివరాలకు ఆటబోమ్మలో విషరసాయనం బులిటెన్ చూడండి ) ప్రయోగిస్తున్నారు. మహిళలకు కూడా వారికి తగినట్లుగా ప్రయోగిస్తున్నారు. (వివరాలకు గర్భిణీ స్త్రీలు షుగరు పేషంట్లే బులిటెన్ చూడండి.)
బి. టి. ప్రత్తి, బి.టి.కూరగాయలు 
         భారతీయులు నూలు వస్త్రాలు ధరించి ఆరోగ్యంగా వున్నారని బి.టి. ప్రత్తిని  ప్రయోగించి, చివరకు కాటన్ దుస్తులు ధరించిన వారికి చర్మ వ్యాధులు వగైరా అనారోగ్యాలు వచ్చేలా  చేస్తున్నారు. అందరూ మెచ్చే వంకాయ కూర విషయంలో  కూడా ఇదే రహస్యం. ఇప్పుడు అది కాదు పాయింటు. కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనేదే సమస్య.
          ఎందుకంటె . . . . . అవసరానికి మించిన డాక్టర్లు వుంటే ప్రగాతా? పతనానికి నాందియా? ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు. 
ఆరోగ్య శ్రీ పథకం 
         ఈ ప్రకారంగా అన్నిరకాల (వైద్య) పాత కుల వృత్తులలోనూ, కొత్త రకం కుల వృత్తులలోనూ, అవసరానికి మించి వున్నారు. అందుకే లాభాల కోసం వ్యాపారస్తులు  తయారుచేసిన వస్తువుల విషయంలోనూ, బట్టల విషయం లోనూ, ఒకటి కొంటె ఒకటి ఉచితం అంటున్నారు. వారికి నష్టాలు రాకుండా ప్రభుత్వం ప్యాకేజీలు యిస్తుంది. డాక్టర్లకు నష్టాలు రాకుండా ఆరోగ్య శ్రీ పథకం అనే పేరుతో నడుపుతున్నారు. ఇది ఎంత కాలం? డాక్టర్లను శాశ్వతంగా ఆరోగ్య శ్రీ పథకంలో పోషించాలంటే ప్రజలకు జబ్బులు ప్రతి సంవత్సరం రావాలి.  అలాగే ఎన్నో పథకాల కోసం ప్రజలు యిబ్బందులకు గురి కాక తప్పదు. 
మెకాలే విద్యా విధానం 
       ఇలా ఎందుకు జరుగుతున్నదంటే మనం భారతీయ సంస్కృతిని, విద్యా విధానాన్ని మరచి, మెకాలే విద్యా విధానాన్ని,విదేశీ సంస్కృతిని నమ్ముకున్నందుకే .
ఆలోచించండి మేధావుల్లరా! 
          ఈ బులిటెన్ను చదివిన Bi .P .C . విద్యార్థులు, తల్లిదండ్రులు, మేము దాక్తర్లుగానే చదువుతాం, చదివిస్తాం అంటే అది మీ ఇష్టం. కానీ ఇది సత్యం అని గ్రహించిన వారు ''చక్కటి ఆరోగ్యం చక్కటి ఆహారం వలన వస్తుంది .డాక్టర్ల వలన రాదు'' అని అలోచించి , రసాయనిక ఎరువులతో కాకుండా సేంద్రియ ఎరువులతో వ్యవసాయ కార్యక్రమంలో దిగితే బాగుంటుందని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...