Wednesday, January 25, 2012

బ్రిటీషు వాళ్ళు మనకిచ్చిన వారసత్వ సంపద డివైడ్ అండ్ రూల్ పాలసీ



         రాజులను విభజించారు. పాలించారు. పర్యవసానం అందరికీ తెలిసిందే.
        ఉమ్మడి కుటుంబాలను విభజించారు. చిన్న కుటుంబాలను చేసారు. ఆ చిన్నకుటుంబాన్ని మరీచిన్నది చేసి ఒకవ్యక్తియే  ఒక కుటుంబం అన్నట్లు చేసారు. దాని పర్యవసానమే ఆర్ధిక సంక్షోభం , కాలుష్య ప్రగతి , అధిక ధరలు యిలా ఎన్నో? ముఖ్యంగా  మనుషులకు టెన్షన్స్ (మరి డాక్టరు బ్రతకాలి కదా! సమస్యలను పంచుకుంటే తరుగుతుంది. లేదంటే పెరుగుతుంది. పంచుకోవడానికి ఉమ్మడి కుటుంబంలో మాత్రమే వీలౌతుంది.) ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు. 
        విద్యను విభజించారు. దాని పర్యవసానం అసంపూర్ణ విద్యతో  అందరూ అన్ని రకాల సమస్యలతో బాధ పడుతున్నారు. ఉదా|| వైద్య విద్యను విభజించారు. పేషంట్ల సంఖ్యను  పెంచారు. 
        పాలను వెన్న తీసిన పాలుగా విభజించారు. సంపూర్ణ  ఆహారం అనేదాన్ని విచ్చిన్నం చేసి అనేక రకాల జబ్బులకు కారణం అయ్యారు. 
        వ్యవసాయంలో మిశ్రమ పంటలను విభజించారు. భూమాతను నాశనం చేసారు.
        ఉమ్మడిగా వున్న పాడిపంటలును రెండుగా (అగ్రికల్చర్, డైరీ) చీల్చారుపొలంగట్ల మీద అనేక రకాల వృక్షాలను పెంచే సాంప్రదాయాన్ని విడగొట్టారు. సేంద్రియ వ్యవసాయానికి అడ్డుకట్ట వేసారు. రైతులను నాశనం చేసారు.
ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోనే మేధావులు. 
          ఎవరు పాలిస్తునారు అనేది కాదు ప్రశ్న? ఎందుకు పాలిస్తున్నారు అనేది పాయింటు. ఎందువలనంటే కేవలం మన భారతీయ సంస్కృతిని, విద్యా విధానాన్ని కాలదన్ని మెకాలే విద్యావిధానాన్ని కౌగిలించుకున్నందుకు. మన భారతీయ సంస్కృతి అయిన కలిసుంటే కలదు సుఖం, ఉమ్మడి కుటుంబ సాంప్రదాయాన్ని వదిలి బ్రిటీషు వారిచ్చిన విభజించు, పాలించు వారసత్వాని పట్టుకుని ఊగుతున్నందుకే. ఆలోచించండి. మేధావుల్లరా! 
స్వాతంత్ర్యం వచ్చిందా!
         1947 లో స్వాతంత్ర్యం వచ్చిందంటున్నారు. వచ్చింది భూభాగానికే కానీ, సంస్కృతికి, భారతీయ విద్యకు రాలేదు. ఇది యింకా విదేశీ మెకాలే పద్ధతిలో నే సర్వనాశనం అవుతూవున్నది. 
         (ఆనాడు, అశోకుడు కానీ, అలెగ్జాండరు కానీ,యుద్ధాలు చేసి ప్రపంచాన్ని కావచ్చును, లేదా, వీలయినన్ని దేశాలు కావచ్చును ఒకే గొడుగు క్రిందకు ఎందుకు తెచ్చేవారంటే ప్రజలందరికీ ఒకే న్యాయం, ఒకే పద్ధతి, ఒకే చట్టం, ఒకే విద్యా యిలా ఎన్నో యూనివర్సల్ గా ఒకే రకంగా వుండాలని. కానీ ఒక గొడుకు క్రిందకు తెచ్చే సరికి ప్రజలు వుండరు చనిపోతారు. అక్కడే కొంచెం  బాధ కలుగుతుంది  )
         కానీ, 1947 లో బ్రిటీషు వాళ్ళు మనల్ని వదలి పోతూ మనకిచ్చిన వారసత్వ సంపదను మనవాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అదే నండీ. డివైడ్ అండ్ రూల్ పాలసీని. ఎలాగంటే... స్కూల్లో ప్రతిజ్ఞ (PLEDGE) భారతీయులందరూ నా సహోదరులు అని అంటూ రాష్ట్రాలుగా విభజించి, వివిధ రకాల న్యాయాలు, చట్టాలు, విద్యలూ, పన్నులూ, ఎలా ఎన్నో.
          భారతీయులందరికీ ఒకే రకమైన చదువు లేదు. ఒక రాష్ట్రం లో విద్య ఉచితం. ఒక రాష్ట్రం లో కొనుక్కోవాలి. ఒక రాష్ట్రం లో వైద్యం ఉచితం. ఒక రాష్ట్రంలో కొనుక్కోవాలి. ఒక్కొక్క రాష్ట్రం లో ఒక్కొక్క విధంగా కూలీలు, వేతనాలు, రవాణా చార్జీలు, పన్నులు. 
          అఖండం గా భారత దేశాన్ని ముక్కలుగా  చేసి రాష్ట్రాలు అన్నారు. కనీసం ఇప్పటివరకు రాష్ట్రంలో నైనా ఒకే విద్య వైద్యం న్యాయం చట్టం వుందని సంతోషించాము. ఇప్పుడు దాన్ని కూడా వివిధ ముక్కలుగా చేసుకుని వివిధ రకాల విద్యను, వైద్యాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నాము. 
ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు.
          1 .   ముందుగా విడాకులు తీసుకోకుండా భార్యా భర్తలు కలసి వుండేది నేర్చుకోవాలి. 
          2 .   అన్నితరాల వారు ఉమ్మడి కుటుంబం గా ఉండటం నేర్చుకోవాలి. 
అప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్ కాదు, అఖండ భారత దేశమే సంపాయించగలం.
         3 . మనసుండి సరైన ప్లానింగ్ ఉండాలే గానీ, అఖండ ప్రపంచాన్నే (ప్రపంచం మొత్తం మీద ఒకే కరెన్సీ, ఒకే ధరలు, ఒకే న్యాయం  ఒకే చట్టం, ఒకే వైద్యం ఒకే విద్య ఒకే రవాణా చార్జీ. ప్రపంచమంతా లోకల్ కాల్ ) సాధించగలం

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...