Wednesday, January 25, 2012

W .H .O . చెప్పినట్లు మనం వినాలా?

ANY ONE TRANSLATE INTO YOUR MOTHER TONGUE AND MAKE A BLOG

 W .H .O . చెప్పినట్లు మనం వినాలా?  
వింటే మన కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి? 
          ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సంఖ్య ప్రకారం కంటే ఎక్కువగా సాధించింది అమెరికా. అంటే ప్రతి 1000  మందికి 1.2  డాక్టర్లు పైగా వున్నారు. ముందు ముందు 1000 మందికి 2 డాక్టర్లు వున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం 1000 కి 1.2  అంటే సుమారుగా 800 లకు ఒక డాక్టరు అని చెప్పుకోవచ్చును. 
          మరి మన భారత దేశంలో, దేశవ్యాప్తంగా ఏడు లక్షల మంది డాక్టర్లకు (జనాభాలో 0.1 % కూడా లేని కొత్తగా ఏర్పడ్డ వైద్య వృత్తి వారి కోసం మిగిలిన వృత్తుల వారు అనేక జబ్బులు తెచ్చుకోవాలి. అందుకోసం పర్యావరణాన్ని పడుచేయ్యాలి అని AN INDIAN OPINION . పూర్తి వివరాలు కాబోయే  డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనే బుల్లిటెన్ లో చూడండి.) 17 లక్షల మంది నర్సుల కొరత వుందని అంకెలు చెబుతున్నాయి. ఏట 70 వేల మంది డాక్టర్లు తయారు  కావలసి వుండగా (డాక్టర్లు అంటే ఒక వాషింగ్ మిషన్ , ఒక మిక్సీ, ఒక కుక్కర్ లా ఫాక్టరీ లో తయారు చేస్తున్నట్లు వుంది కదా! అంటే ప్రస్తుత పాలకుల - విదేశి సంస్కృతిని కాపీ కొట్టాలి గా మరి - దృష్టిలో వైద్యుడు ఒక నిత్యావసర వస్తువు. కానీ భారతీయ సంస్కృతి ప్రకారం వైద్యుడు ఒక అత్యవసర సేవకుడు. (వ్యాపారస్తుడు కాదు) అని AN INDIAN ఒపీనియన్. ఆలోచించండి మేధావుల్లరా!) అందులో సగమే తయారు అవుతున్నారు. దేశంలో ప్రస్తుతం 1 , 953  మందికి ఒక డాక్టరు వుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సంఖ్య ప్రకారం 1000 మందికి ఒక డాక్టరు వుండాలి అంటూ ఇంకా చాల వ్రాసారు ఒక దిన పత్రిక 4 - 1 - 12  న ఎడిటోరియల్ లో
ఇది డాక్టర్ల సమస్య ? లేక ప్రజల సమస్య ? 
          ఇది ప్రజల సమస్యే! కానీ, ప్రజల్లో ఒక భాగమైన డాక్టర్ల సమస్య. ఎందుకంటె, 
          1 ) డాక్టర్ల సంఖ్య ఎంత మంది ఉండాలో నిర్ణయిస్తున్నది. W.H.O. సంస్థ 
          2 ) అదే సంస్థ ప్రజలకు పౌష్టిక ఆహారం తినండి అంటుంది.  ఏది నమ్మాలి. 
          3 ) ప్రజలందరికి ఆరోగ్యం మంచిగా వుండాలని ఈ మధ్య సేంద్రియ వ్యవసాయం తో చేసిన పంటలు తినండి ఆరోగ్యంగా వుండండి. అంటున్నారు. అలాగే చాల రకాల  సంస్థలు న్యూట్రి షియన్ ఫుడ్స్ అంటూ అమ్ముతున్నారు. పర్యావరణాన్ని కాపాడండి, ఆరోగ్యంగా వుండండి అంటున్నారు కొందరు. చివరకు Tea కూడా హెర్బల్ టీ లు అంటున్నారు. చివరకు కొంత మంది డాక్టర్లు కూడా పబ్లిక్ మీటింగ్స్ లో పౌష్టిక ఆహారం తీసుకోండి, సంపూర్ణ ఆరోగ్యం గా వుండండి అని అంటున్నారు.
          4 ) మరి ప్రజలు ఆరోగ్యం గా  వుంటే .......1000  మందికి ఒక డాక్టరు ఎలా బ్రతకాలి ? 
          5 ) యుద్ధాలు రాకపోయినా మిలటిరీ సైన్యాన్ని పోషిస్తున్నట్లు, ఇండ్లు కాలక పోయినా ఫైర్ సిబ్బందిని పోషిస్తున్నట్లు, ప్రజలకు జబ్బులు రాకపోయినా డాక్టర్లను ప్రభుత్వాలు నెల జీతాలుతో పోషిస్తాయి. ( ఇది అవసరం ఇది ప్రజా సంక్షేమంలో ఒక భాగం ) కానీ , ప్రైవేటు హాస్పిటల్స్ ను కూడా పోషిస్తుందా? అంటే ఎంత మందిని పోషిస్తుంది?
          6 )  లేదా ప్రజలందరూ డాక్టర్లను పోషించడానికి అనారోగ్యాల పలు కావాలా? ఇలా ఎందుకు ఆలోచించాలంటే..... ఫైర్ సిబ్బందిని పోషించడానికి మనం ఇండ్లను తగుల పెట్టుకోవడం లేదు కదా! ఉదాహరణ కు ఒక మునిసిపల్ పరిధిలో ఒక లక్ష జనాభా వుంటే వారికీ ఒక ఫైర్ స్టేషన్ వుంటుంది. అక్కడ 1000 మందికి ఒక్కరు చొప్పున లక్షకి 100  మంది సిబ్బంది వున్నారా? పోనీ, 50 మంది సిబ్బంది వున్నారా? లేదు. ఎందుకంటె ప్రతి రోజు ఎవరూ అదే పనిగా ఇండ్లు కాల్చుకోరు. వారు అత్యవసర పరిస్థితిలో సేవ చేస్తున్నారు కనుక వారిని పోషించడంలో ఒక అర్థం వుంది. ఎవరు పోషిస్తున్నారు? ప్రభుత్వం అంటారు ప్రభుత్వం అంటే ప్రజలే. ప్రజల పన్నుల్లో నుండి వారికి కేటాయిస్తారు.
           కానీ, W.H.O.  సంస్థ చెప్పినట్లు 1000 మందికి ఒక్కరు చొప్పున ఒక లక్ష జనాభాకి 100  మంది డాక్టర్లను పోషించాలంటే ఎలా? ఒక్కొక ఫైర్ మెన్ ని తయారు చేయడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నది. వారికి ఎంత జీతం తో పోషిస్తుంది. దాంతో పోల్చుకుంటే ఒక్కొక డాక్టరును తయారు చేయడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నది. వారికి ఎంత జీతం తో పోషిస్తుంది. (ప్రజలందరికి అంటే లక్ష మందికి పౌష్టిక ఆహారం తో పోషించడం కష్టమని ప్రజందరిని జబ్బులతో రండి 1000 మందికి ఒక్కరు డాక్టరు ను పోషిస్తం  అంటున్నది ప్రభుత్వం.) ప్రజలందరూ పౌష్టిక ఆహారం తీసుకుని ఆరోగ్యం గ వుంటే (అలా వుండాలని ఆశిద్దాం) ఒక లక్షకి 100  మంది డాక్టర్లు అవసరమా? వారికి ఎంత జీతాలు ఇవ్వాలి? ఆ 100  మంది ప్రభుత్వ ఆధీనములో వుంది సేవ చేయాలా? లేక ప్రైవేటుగా సేవ చేయాలా? ప్రైవేటుగా సేవ చేస్తుంటే, వారిని కూడా పోషించాలా?
          లేదా ప్రజలు ఆరోగ్యాలు పాడు చేసుకోవాలా? 
          అయితే ఎలా ? పర్యావరణాన్ని పడుచేయండి. అనేక రకాల కాలుష్యాలతో నగరాలను, పట్టణాలను, గ్రామాలను పాడు చేయండి. తద్వారా జబ్బులు తెచ్చుకోండి. ఎందుకంటె, ప్రైవేటు డాక్టర్లు పేషంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. పేషంట్లు వస్తేనే వారికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా బిల్లులు వస్తాయి. ఎందుకంటె వారికి ప్రభుత్వాలు జీతాలు ఇవ్వటం లేదు. (పూర్తి వివరాలు కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి? బుల్లిటిన్ లో చూడండి)
          లేదాW.H.ఓ సంస్థ చెప్పినట్లు వినకుండా వుండాలి.
          ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని అనుకుని పర్యావరణాన్ని పాడు చేయకుండా, పౌష్టిక ఆహారాన్ని ప్రోత్సహిస్తూ, జబ్బులు రాకుండా చూడాలి. మనవ వైపరీత్యా(పర్యావరణం పాడుచేసి) జబ్బులు రాకుండా  ప్రకృతి వైపరీత్యా వలన ఎవరికైన జబ్బులు వస్తే వారికి సేవ చేసే విధానం నేర్చుకోవాలి. ఆలోచించండి  మేధావుల్లరా!

ఆటో డ్రైవర్లు కూడా సామాన్యులే


 
 ఆటోల రూటే సపరేటు. తిరుపతి లో ఇష్టా రాజ్యం.
ఎక్కితే రూ 20 /- ఇచ్చుకోవాల్సిందే
.......................ఇంకా వుంది




                                                          
       




         బులిటెన్ 4 మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది..........త్వరలో.....  
బులిటెన్ 5    అఖండ ఆంద్ర - సమైఖ్య ఆంద్ర ........ త్వరలో  .......
బులిటెన్ 6  వారంతా గ్రామ దేవతలే .......... త్వరలో ................. 
బులిటెన్ 8 అవసరానికి మించి వుంటే తప్పదు ఆర్ధిక సంక్షోభం ........  త్వరలో
బులిటెన్ 9  ఒకే రోజు మూడు బ్యాంకులు క్లోజ్............త్వరలో ..................... 
అధిక ధరల నియంత్రణ చైతన్య బులిటెన్ లు త్వరలో ................. 
బ్రిటీషు వాళ్ళు ఎందుకు మనదేశం వదిలి వెళ్లారు?..........త్వరలో 
                   ఇందులో ఏది ముందు కావాలో కామెంట్స్ లో తెలుపండి 

బ్రిటీషు వాళ్ళు మనకిచ్చిన వారసత్వ సంపద డివైడ్ అండ్ రూల్ పాలసీ



         రాజులను విభజించారు. పాలించారు. పర్యవసానం అందరికీ తెలిసిందే.
        ఉమ్మడి కుటుంబాలను విభజించారు. చిన్న కుటుంబాలను చేసారు. ఆ చిన్నకుటుంబాన్ని మరీచిన్నది చేసి ఒకవ్యక్తియే  ఒక కుటుంబం అన్నట్లు చేసారు. దాని పర్యవసానమే ఆర్ధిక సంక్షోభం , కాలుష్య ప్రగతి , అధిక ధరలు యిలా ఎన్నో? ముఖ్యంగా  మనుషులకు టెన్షన్స్ (మరి డాక్టరు బ్రతకాలి కదా! సమస్యలను పంచుకుంటే తరుగుతుంది. లేదంటే పెరుగుతుంది. పంచుకోవడానికి ఉమ్మడి కుటుంబంలో మాత్రమే వీలౌతుంది.) ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు. 
        విద్యను విభజించారు. దాని పర్యవసానం అసంపూర్ణ విద్యతో  అందరూ అన్ని రకాల సమస్యలతో బాధ పడుతున్నారు. ఉదా|| వైద్య విద్యను విభజించారు. పేషంట్ల సంఖ్యను  పెంచారు. 
        పాలను వెన్న తీసిన పాలుగా విభజించారు. సంపూర్ణ  ఆహారం అనేదాన్ని విచ్చిన్నం చేసి అనేక రకాల జబ్బులకు కారణం అయ్యారు. 
        వ్యవసాయంలో మిశ్రమ పంటలను విభజించారు. భూమాతను నాశనం చేసారు.
        ఉమ్మడిగా వున్న పాడిపంటలును రెండుగా (అగ్రికల్చర్, డైరీ) చీల్చారుపొలంగట్ల మీద అనేక రకాల వృక్షాలను పెంచే సాంప్రదాయాన్ని విడగొట్టారు. సేంద్రియ వ్యవసాయానికి అడ్డుకట్ట వేసారు. రైతులను నాశనం చేసారు.
ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోనే మేధావులు. 
          ఎవరు పాలిస్తునారు అనేది కాదు ప్రశ్న? ఎందుకు పాలిస్తున్నారు అనేది పాయింటు. ఎందువలనంటే కేవలం మన భారతీయ సంస్కృతిని, విద్యా విధానాన్ని కాలదన్ని మెకాలే విద్యావిధానాన్ని కౌగిలించుకున్నందుకు. మన భారతీయ సంస్కృతి అయిన కలిసుంటే కలదు సుఖం, ఉమ్మడి కుటుంబ సాంప్రదాయాన్ని వదిలి బ్రిటీషు వారిచ్చిన విభజించు, పాలించు వారసత్వాని పట్టుకుని ఊగుతున్నందుకే. ఆలోచించండి. మేధావుల్లరా! 
స్వాతంత్ర్యం వచ్చిందా!
         1947 లో స్వాతంత్ర్యం వచ్చిందంటున్నారు. వచ్చింది భూభాగానికే కానీ, సంస్కృతికి, భారతీయ విద్యకు రాలేదు. ఇది యింకా విదేశీ మెకాలే పద్ధతిలో నే సర్వనాశనం అవుతూవున్నది. 
         (ఆనాడు, అశోకుడు కానీ, అలెగ్జాండరు కానీ,యుద్ధాలు చేసి ప్రపంచాన్ని కావచ్చును, లేదా, వీలయినన్ని దేశాలు కావచ్చును ఒకే గొడుగు క్రిందకు ఎందుకు తెచ్చేవారంటే ప్రజలందరికీ ఒకే న్యాయం, ఒకే పద్ధతి, ఒకే చట్టం, ఒకే విద్యా యిలా ఎన్నో యూనివర్సల్ గా ఒకే రకంగా వుండాలని. కానీ ఒక గొడుకు క్రిందకు తెచ్చే సరికి ప్రజలు వుండరు చనిపోతారు. అక్కడే కొంచెం  బాధ కలుగుతుంది  )
         కానీ, 1947 లో బ్రిటీషు వాళ్ళు మనల్ని వదలి పోతూ మనకిచ్చిన వారసత్వ సంపదను మనవాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అదే నండీ. డివైడ్ అండ్ రూల్ పాలసీని. ఎలాగంటే... స్కూల్లో ప్రతిజ్ఞ (PLEDGE) భారతీయులందరూ నా సహోదరులు అని అంటూ రాష్ట్రాలుగా విభజించి, వివిధ రకాల న్యాయాలు, చట్టాలు, విద్యలూ, పన్నులూ, ఎలా ఎన్నో.
          భారతీయులందరికీ ఒకే రకమైన చదువు లేదు. ఒక రాష్ట్రం లో విద్య ఉచితం. ఒక రాష్ట్రం లో కొనుక్కోవాలి. ఒక రాష్ట్రం లో వైద్యం ఉచితం. ఒక రాష్ట్రంలో కొనుక్కోవాలి. ఒక్కొక్క రాష్ట్రం లో ఒక్కొక్క విధంగా కూలీలు, వేతనాలు, రవాణా చార్జీలు, పన్నులు. 
          అఖండం గా భారత దేశాన్ని ముక్కలుగా  చేసి రాష్ట్రాలు అన్నారు. కనీసం ఇప్పటివరకు రాష్ట్రంలో నైనా ఒకే విద్య వైద్యం న్యాయం చట్టం వుందని సంతోషించాము. ఇప్పుడు దాన్ని కూడా వివిధ ముక్కలుగా చేసుకుని వివిధ రకాల విద్యను, వైద్యాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నాము. 
ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు.
          1 .   ముందుగా విడాకులు తీసుకోకుండా భార్యా భర్తలు కలసి వుండేది నేర్చుకోవాలి. 
          2 .   అన్నితరాల వారు ఉమ్మడి కుటుంబం గా ఉండటం నేర్చుకోవాలి. 
అప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్ కాదు, అఖండ భారత దేశమే సంపాయించగలం.
         3 . మనసుండి సరైన ప్లానింగ్ ఉండాలే గానీ, అఖండ ప్రపంచాన్నే (ప్రపంచం మొత్తం మీద ఒకే కరెన్సీ, ఒకే ధరలు, ఒకే న్యాయం  ఒకే చట్టం, ఒకే వైద్యం ఒకే విద్య ఒకే రవాణా చార్జీ. ప్రపంచమంతా లోకల్ కాల్ ) సాధించగలం

కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి?

           ఆ సేతు హిమాచలం మానవాభి వృద్ధిలో మహోజ్జ్వలం 
            మానవాభి వృద్ధిలో 60 వసంతాల గణతంత్ర భారత్ సాధించిన ప్రగతి అనన్య సామాన్యం...... అంటూ చాలా వ్రాసారు. 26 -1 -2010 న ఈనాడు  దినపత్రికలో. అది వారి తప్పుకాదు. అది ఒక వార్త. ప్రచురించారు. అంతే. వార్త వచ్చినందుకే ఆలోచించడానికి అవకాశం.
            ఇంకా వివరాల్లోకి వెళ్ళితే ....... లక్ష మంది ప్రజలకు ఆనాడు 16 మంది వైద్యులు వుండేవారు. ఈనాడు ఆ సంఖ్యా  60 మందికి చేరింది అని వ్రాసారు. ఇది మానవాభి వృద్ధిలో కి వస్తుందా? రాదా? ఆలోచించండి. మేధావుల్లారా! 
             ఆనాడు అంటే 1950 లో 1 ,00 ,000 మందికి 16 మంది డాక్టర్లు. అది ఎక్కువా? తక్కువా? అనేది ఆనాటి జనాభా సంఖ్యను బట్టి చెప్పాలి. అలాగే చెప్పాము అనుకుందాము. మరి వైద్యుల సంఖ్య పెరిగితే ప్రగతా? ప్రజలు ఆరోగ్యంగా వుంటే ప్రగతా? అని ప్రశ్నించుకుంటే ప్రజలు ఆరోగ్యంగా వుంటే ప్రగతి అని అందరూ అంటారు. ఆరోగ్యం అంటే ఏమిటి? (వివరాలు పర్యావరణాన్ని పాడు చేద్దాం రండి అనే బులిటిన్ లో చూడండి )
              కానీ, ప్రజల్లో ఒక భాగమైన డాక్టర్లు కూడా బ్రతకాలి కదా! అందుకే ప్రజలు అనారోగ్యంగా ఉండటమే ప్రగతి అని కొందరు మేధావులు వారి కోసం ప్రజలకు ఎలా జబ్బులు రావాలో కనిపెడుతూ వచ్చారు. అందులో భాగంగా రసాయనిక ఎరువులు కనిపెట్టి, ఉపయోగించి, వ్యవసాయం నేర్పించారు. రైతులకు, మిగిలిన ప్రజలకు అనారోగ్యాలు వచ్చేలా ఆలోచించారు. ఇటు ప్రజలను, అటు భూమాతను అనారోగ్యం పాలు చేసారు.ఆలోచించండి. మేదావుల్లారా! ఇప్పుడు అది కాదు పాయింటు. డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనేది సమస్య? ఎందుకంటే
ప్రతి 6 నెలలకు ఒకసారి (1950 లో) 
          1950 లో 1 ,00 ,000 మందికి 16 డాక్టర్లు వున్నప్పుడు . . . .  ఉదా||కు 1 ,00 ,000 /16 =6 ,250 మంది పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  రోజుకు 8 గం|| ప్రాక్టీసు చేస్తే అందులో గంటకు 4 చొప్పున పరీక్ష చేస్తే 32 మందికి పరీక్ష చేయవచ్చును. ఆ ప్రకారముగా నెలకు 32 x 30 = 960 మందికి అంటే సుమారు నెలకు 1 ,000 మందికి పరీక్ష చేయవచ్చును. ఈ 1 ,000  మంది ప్రతి నెలా పేషంట్ల రూపంలో రాగలరా? రాలేరు. పోనీ, ప్రతి 6 నెలలకు ఒకసారి రాగలరా? వచ్చారు అనుకుందాం. అంటే ఒక్కొక్క డాక్టరుకు 6 ,000 మంది పర్మనెంటు పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ. (ఒక్కొక్క పేషంటు అప్పట్లో 1 రూపాయి యిచ్చినా నెలకు 1000 రూపాయలు ఆదాయం. అంటే 1950 లో ఒక ఐ.ఏ.ఎస్. నెల జీతం (రూ|| 350 /-) కంటే దాదాపు ౩ రెట్లు ఎక్కువ.)  ఈ లెఖ్ఖల ప్రకారం ఎన్ని మెడికల్ కాలేజీలు వుండాలి. ఎంత మంది భవిష్యత్తులో డాక్టర్లు కావాలి అని బడ్జెట్టు వేసుకుని వుంటే ఈనాడు డాక్టర్లు ఎలా బ్రతకాలి అని ఆలోచించాల్సిన పని లేదు. ఆలోచించండి మేధావుల్లారా! ముఖ్యంగా యువతలోని మేధావులు. (వివరాలకు అవసరానికి మించి వుంటే తప్పదు ఆర్ధిక సంక్షోభం బులిటెన్ లో చూడండి)
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo  
-------------------------------------------------------------------------------------------------
ప్రతి 3 నెలలకు ఒకసారి (2010 లో) 
          2010  కి 60  మంది డాక్టర్లు ఉండేలా ప్రగతి సాధించింది అని అంటున్నారు. అంటే మన దేశ జనాభాకు (1 ,30 ,00 ,00 ,000 /1 ,00 ,000 x 60 = 7 ,80 ,000 డాక్టర్లు  వున్నట్లు లెఖ్ఖ. ) అంటే ఉదా||కు 1 ,00 ,000 /60 = 1 ,600  మంది పేషంట్లు  ఒక్కొక్క డాక్టరుకు  వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  (రోజుకు 8 గం|| ప్రాక్టీసు చేస్తే ) 1 ,000 మంది పేషంట్లు కావాలి. ఈ లెక్కన పేషంట్లు కనీసం రెండు నెలలకు ఒకసారి వచ్చి తీరాలి? ఎలా?  . . . జనాభాను పెంచలేరు. ఎందుకంటె, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రవేశ పెట్టిందే డాక్టర్లకు పేషంట్లు రావడానికి కదా! అయితే ఎలా? అని ఆలోచించి కొందరు మేధావులు 1950 నుండి సేంద్రియ వ్యవసాయాన్ని దూరం చేసి, రసాయనిక ఎరువులతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, ఒక వైపు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసారు. మరో వైపు భూసారాన్ని నాశనం చేసారు. ఇంకా రకరకాలుగా ఆరోగ్యాలను చెడగొట్టడానికి పెద్దలకు స్లో పాయిజన్ లాంటి గుట్కాలను, ఆల్కహాల్ ను , పిల్లల మీద రెడి మేడ్ ప్రాసెస్డ్ పేకేజేడ్ ఫుడ్ ను , విష రసాయనాలతో నిండిన బొమ్మలను (వివరాలకు ఆటబోమ్మలో విషరసాయనం బులిటెన్ చూడండి ) ప్రయోగిస్తున్నారు. మహిళలకు కూడా వారికి తగినట్లుగా ప్రయోగిస్తున్నారు. (వివరాలకు గర్భిణీ స్త్రీలు షుగరు పేషంట్లే బులిటెన్ చూడండి.)
బి. టి. ప్రత్తి, బి.టి.కూరగాయలు 
         భారతీయులు నూలు వస్త్రాలు ధరించి ఆరోగ్యంగా వున్నారని బి.టి. ప్రత్తిని  ప్రయోగించి, చివరకు కాటన్ దుస్తులు ధరించిన వారికి చర్మ వ్యాధులు వగైరా అనారోగ్యాలు వచ్చేలా  చేస్తున్నారు. అందరూ మెచ్చే వంకాయ కూర విషయంలో  కూడా ఇదే రహస్యం. ఇప్పుడు అది కాదు పాయింటు. కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనేదే సమస్య.
          ఎందుకంటె . . . . . అవసరానికి మించిన డాక్టర్లు వుంటే ప్రగాతా? పతనానికి నాందియా? ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు. 
ఆరోగ్య శ్రీ పథకం 
         ఈ ప్రకారంగా అన్నిరకాల (వైద్య) పాత కుల వృత్తులలోనూ, కొత్త రకం కుల వృత్తులలోనూ, అవసరానికి మించి వున్నారు. అందుకే లాభాల కోసం వ్యాపారస్తులు  తయారుచేసిన వస్తువుల విషయంలోనూ, బట్టల విషయం లోనూ, ఒకటి కొంటె ఒకటి ఉచితం అంటున్నారు. వారికి నష్టాలు రాకుండా ప్రభుత్వం ప్యాకేజీలు యిస్తుంది. డాక్టర్లకు నష్టాలు రాకుండా ఆరోగ్య శ్రీ పథకం అనే పేరుతో నడుపుతున్నారు. ఇది ఎంత కాలం? డాక్టర్లను శాశ్వతంగా ఆరోగ్య శ్రీ పథకంలో పోషించాలంటే ప్రజలకు జబ్బులు ప్రతి సంవత్సరం రావాలి.  అలాగే ఎన్నో పథకాల కోసం ప్రజలు యిబ్బందులకు గురి కాక తప్పదు. 
మెకాలే విద్యా విధానం 
       ఇలా ఎందుకు జరుగుతున్నదంటే మనం భారతీయ సంస్కృతిని, విద్యా విధానాన్ని మరచి, మెకాలే విద్యా విధానాన్ని,విదేశీ సంస్కృతిని నమ్ముకున్నందుకే .
ఆలోచించండి మేధావుల్లరా! 
          ఈ బులిటెన్ను చదివిన Bi .P .C . విద్యార్థులు, తల్లిదండ్రులు, మేము దాక్తర్లుగానే చదువుతాం, చదివిస్తాం అంటే అది మీ ఇష్టం. కానీ ఇది సత్యం అని గ్రహించిన వారు ''చక్కటి ఆరోగ్యం చక్కటి ఆహారం వలన వస్తుంది .డాక్టర్ల వలన రాదు'' అని అలోచించి , రసాయనిక ఎరువులతో కాకుండా సేంద్రియ ఎరువులతో వ్యవసాయ కార్యక్రమంలో దిగితే బాగుంటుందని ఆశిస్తున్నాము.

కంప్యుటర్ నాలెడ్జి ,ఇంటర్ నెట్ నాలెడ్జి వారు నాలెడ్జి ఎలా బ్రతకాలి?




పాడి పంటలు చేస్తే మంచిది. 
వీలు లేని వారి కోసమే ఆన్ లైన్ వ్యాపారం.
          ప్రకృతి పరిస్థితుల ప్రకారం అంటే నాచురల్ గా మనకు జుట్టు, గడ్డము, పెరుగుతుంది. మన బట్టలు మాసిపోతుంది. మన చెప్పులు అరిగిపోతుంది. మనకు ఆకలి వేస్తుంది. కాబట్టి మనం మంగలి వాళ్ళను, చాకలి వాళ్ళను, చర్మకారులను, రైతు లను, వాటికీ అనుబంధ వృత్తులను పోషిస్తున్నాం. అయితే వృత్తులు కాకుండా కొన్ని ప్రవృత్తులు వుంటాయి. వాటిని చాలా వృత్తుల వారు సైడుగా అంటే హాబీగా చేసేవారు గతంలో. 
వృత్తులు - ప్రవృత్తులు 
          వృత్తుల వలన ఆదాయం వుంటుంది. ప్రవృత్తుల వలన ఆనందం వుంటుంది. వృత్తుల వలన ఇంట్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రవృత్తుల వలన మంచి ఇంటి బయట పేరు ప్రతిష్టలు వస్తాయి. వృత్తుల వలన మంచి తల్లితండ్రులు అని అనిపించుకుంటారు. ప్రవృత్తుల వలన మంచి సేవకుడు, నాయకుడు అని అనిపించుకుంటారు.  అయితే, ప్రస్తుతం ప్రవృత్తులు కూడా వృత్తులై పోయాయి. అందులో కొన్ని వైద్యం, న్యాయం, చట్టం. ఇలా ఎన్నో . . . .గతంలోని ప్రవృత్తులు ఇప్పుడు వ్రుత్తుల్లా వున్నాయి. (వివరాలకు కొత్త కులాలు అనే బులిటెన్ చూడండి.
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo
-------------------------------------------------------------------------------------------------
          అంతే కాకుండా ప్రస్తుతం మానవుని అవసర రీత్యా ఎన్నో కొత్త వృత్తులు, ప్రవృత్తులు పుట్టుకొచ్చాయి. (వివరాలకు కొత్తకులాలు అనే బులిటెన్ చూడండి.) పైన చెప్పుకున్న మంగలి, చాకలి, చర్మకారుడు, రైతు,కుమ్మరి,కమ్మరి, లాంటివారిని, పోషించడానికి ఒక రీజన్ వుంది, కానీ, వైద్యులను పోషించడానికి ప్రజలకు జబ్బులు రావాలి. ఎలా? అని కొందరు ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నారు. వివరాలకు కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనే బులిటన్ చూడండి. అలాగే న్యాయవాదులు బ్రతకాలంటే మానవులకు సమస్యలు రావాలి. ఎలా? అని కొందరు ప్రయోగించి విజయవంతం అవుతున్నారు. కాబోయే లాయర్లు ఎలా బ్రతకాలి? అనే బులిటెన్ చూడండి. అలాగే చట్టసభల్లో చట్టం చేసేవాళ్ళు బ్రతకాలంటే ప్రజలకు లేమి రావాలి. ఎలా అని కొందరు కొన్ని ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నారు. (వివరాలకు సంక్షేమ పథకాలు అవసరమా? అనే బులిటెన్ చూడండి
         అలాగే ప్రస్తుతం కంప్యుటర్ నాలెడ్జి ,ఇంటర్ నెట్ నాలెడ్జి లలో రకరకాల చదువులు చదివి మరియు ఎం బి ఏ లు చదివినవారు బ్రతకాలంటే ఎలా? అందులో భాగమే ఆన్ లైన్ వ్యాపారం. అందులో ఎన్నో రకాలు వున్నాయి. ఎన్నో స్థాయిల్లో వున్నాయి. ఎన్నో సంస్థలు వున్నాయి. ఇందులో వ్యాపారం చేయాలి అని స్వంతంగా ఒక ల్యాప్ ట్యాప్ కలిగివుండాలి. వర్కింగ్ క్యాపిటల్ క్రింద కనీసం 10 వేలు అయినా పెట్టుకుని వస్తువులు తీసుకుని, పిన్నులు తీసుకుని, ప్రజల వద్దకు వెళ్లి వ్యాపారం గురించి చెప్పండి. ల్యాప్ ట్యాప్ లో చూపండి. వస్తువులు అమ్మండి. కాని తప్పనిసరిగా బ్యాంకు అకౌంటు ఉన్నవారికి మాత్రం అమ్మండి. కంప్యుటర్, ఇంటర్నెట్ తెలియని వారికి కూడా అమ్మండి. కాని వారికి అన్ని, అంటే దరఖాస్తు వివరములు మీరే పూర్తి చేయండి. అంతేకాదు ప్రతినెల వారివి  అప్ డేట్ చేయండి. వ్యాపారానికి కావలసింది నమ్మకం. అది సంపాయించండి  ప్రజల దగ్గర.
నో సర్వీస్ - నో బిజినెస్ 
         ఒక ఎల్. ఐ.సి. ఏజంటు తన పాలసీ హోల్డర్లకు ఎలాంటి సేవ చేస్తాడో అలాగే మీరు మీ కస్టమర్లకు సేవ చేయండి. వారికి కంప్యుటర్, ఇంటర్నెట్ నాలెడ్జి లేని వారు కనుక మీరు వారికి సర్వీసు చేయక పోతే వ్యాపారం మంచిగా జరగదు.

అన్ని సమస్యలకూ పరిష్కారం నిరాహార దీక్ష

అన్ని సమస్యలకూ పరిష్కారం నిరాహార దీక్ష
        అవును! ఇది సత్యం. అన్ని సమస్యలకూ పరిష్కార మార్గం నిరాహార దీక్షలో దొరుకుతుంది. అయితే అది సక్రమంగా వుండాలి. లేకపోతే పరిష్కార మార్గం దొరకదు. సక్రమంగా అంటే ఎలా? నిరాహారదీక్ష చేసేటప్పుడు మౌన వ్రతం కూడా వుండాలి. అంతేకాదు, సమస్య మీద ధ్యాస వుండాలి. సమస్య మీద ధ్యాస అంటే ఏమిటి? సమస్య మీద అంటే .......సమస్య మీదే. సమస్య పరిష్కారం కాదేమో అనే అనుమానం మీద ధ్యాస వుండకూడదు. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని విశ్వాసం మీద కూడా ధ్యాస వుండకూడదు. సమస్య మీదే వుండాలి ధ్యాస.పరిష్కారం కాకపోతే మళ్ళీ ఏమి చెయ్యాలి అనేదాని దాని మీద ధ్యాస వుండకూడదు.ధ్యాస వున్నది అంటే తప్పనిసరిగా ఉచ్చ్వాస నిస్స్వాసాలు అందులో పాలుపంచుకుంటాయి. అవి పలుపంచుకోకపోతే గ్యారంటీగా సమస్యకు పరిష్కారం దొరకదు. అది గుర్తుంచుకుని నిరాహారదీక్ష చేపట్టాలి.
           కొన్ని భారతీయ శాస్త్రాల లెక్కల ప్రకారం ప్రస్తుత కాలమాన ప్రకారం 40 గంటలు  సక్రమంగా సమస్య మీద ధ్యాస పెట్టి నిరాహారదీక్ష చేస్తే సమస్య పరిష్కారం  అవుతుంది. గంట గంటకూ టీ, కాఫీలకు అలవాటు పడినవారు ఏకంగా 40 గంటలు నిరాహారదీక్ష చేపట్టడం కుదురుతుందా? ఆలోచించండి.
---------------------------------------------------------------------------------------------------------
అడగక ముందే సహాయం చేసే వారు దేవతలు 
అడిగితే సహాయం చేసేవారు మానవులు 
అడిగినా సహాయం చేయనివారు రాక్షసులు 
ఏ జాతిలో వుంటారు మీరు? ఆలోచించండి. 


Related Posts Plugin for WordPress, Blogger...