Wednesday, January 26, 2011


 అన్ని సమస్యలకూ పరిష్కారం నిరాహార దీక్ష
        అవును! ఇది సత్యం. అన్ని సమస్యలకూ పరిష్కార మార్గం నిరాహార దీక్షలో దొరుకుతుంది. అయితే అది సక్రమంగా వుండాలి. లేకపోతే పరిష్కార మార్గం దొరకదు. సక్రమంగా అంటే ఎలా? నిరాహారదీక్ష చేసేటప్పుడు మౌన వ్రతం కూడా వుండాలి. అంతేకాదు, సమస్య మీద ధ్యాస వుండాలి. సమస్య మీద ధ్యాస అంటే ఏమిటి? సమస్య మీద అంటే .......సమస్య మీదే. సమస్య పరిష్కారం కాదేమో అనే అనుమానం మీద ధ్యాస వుండకూడదు. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని విశ్వాసం మీద కూడా ధ్యాస వుండకూడదు. సమస్య మీదే వుండాలి ధ్యాస.పరిష్కారం కాకపోతే మళ్ళీ ఏమి చెయ్యాలి అనేదాని దాని మీద ధ్యాస వుండకూడదు.ధ్యాస వున్నది అంటే తప్పనిసరిగా ఉచ్చ్వాస నిస్స్వాసాలు అందులో పాలుపంచుకుంటాయి. అవి పలుపంచుకోకపోతే గ్యారంటీగా సమస్యకు పరిష్కారం దొరకదు. అది గుర్తుంచుకుని నిరాహారదీక్ష చేపట్టాలి.
           కొన్ని భారతీయ శాస్త్రాల లెక్కల ప్రకారం ప్రస్తుత కాలమాన ప్రకారం 40 గంటలు  సక్రమంగా సమస్య మీద ధ్యాస పెట్టి నిరాహారదీక్ష చేస్తే సమస్య పరిష్కారం  అవుతుంది. గంట గంటకూ టీ, కాఫీలకు అలవాటు పడినవారు ఏకంగా 40 గంటలు నిరాహారదీక్ష చేపట్టడం కుదురుతుందా? ఆలోచించండి.
DUE TO POLLUTION LOVERS 
BHAGAWAN SRI SATHYA SAI BABA 
FELL IN SICK  
Details below


పాడి పంటలు చేస్తే మంచిది. 
వీలు లేని వారి కోసమే ఆన్ లైన్ వ్యాపారం.
          ప్రకృతి పరిస్థితుల ప్రకారం అంటే నాచురల్ గా మనకు జుట్టు, గడ్డము, పెరుగుతుంది. మన బట్టలు మాసిపోతుంది. మన చెప్పులు అరిగిపోతుంది. మనకు ఆకలి వేస్తుంది. కాబట్టి మనం మంగలి వాళ్ళను, చాకలి వాళ్ళను, చర్మకారులను, రైతు లను, వాటికీ అనుబంధ వృత్తులను పోషిస్తున్నాం. అయితే వృత్తులు కాకుండా కొన్ని ప్రవృత్తులు వుంటాయి. వాటిని చాలా వృత్తుల వారు సైడుగా అంటే హాబీగా చేసేవారు గతంలో. 
వృత్తులు - ప్రవృత్తులు 
          వృత్తుల వలన ఆదాయం వుంటుంది. ప్రవృత్తుల వలన ఆనందం వుంటుంది. వృత్తుల వలన ఇంట్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రవృత్తుల వలన మంచి ఇంటి బయట పేరు ప్రతిష్టలు వస్తాయి. వృత్తుల వలన మంచి తల్లితండ్రులు అని అనిపించుకుంటారు. ప్రవృత్తుల వలన మంచి సేవకుడు, నాయకుడు అని అనిపించుకుంటారు.  అయితే, ప్రస్తుతం ప్రవృత్తులు కూడా వృత్తులై పోయాయి. అందులో కొన్ని వైద్యం, న్యాయం, చట్టం. ఇలా ఎన్నో . . . .గతంలోని ప్రవృత్తులు ఇప్పుడు వ్రుత్తుల్లా వున్నాయి. (వివరాలకు కొత్త కులాలు అనే బులిటెన్ చూడండి.
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo
-------------------------------------------------------------------------------------------------
          అంతే కాకుండా ప్రస్తుతం మానవుని అవసర రీత్యా ఎన్నో కొత్త వృత్తులు, ప్రవృత్తులు పుట్టుకొచ్చాయి. (వివరాలకు కొత్తకులాలు అనే బులిటెన్ చూడండి.) పైన చెప్పుకున్న మంగలి, చాకలి, చర్మకారుడు, రైతు,కుమ్మరి,కమ్మరి, లాంటివారిని, పోషించడానికి ఒక రీజన్ వుంది, కానీ, వైద్యులను పోషించడానికి ప్రజలకు జబ్బులు రావాలి. ఎలా? అని కొందరు ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నారు. వివరాలకు కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనే బులిటన్ చూడండి. అలాగే న్యాయవాదులు బ్రతకాలంటే మానవులకు సమస్యలు రావాలి. ఎలా? అని కొందరు ప్రయోగించి విజయవంతం అవుతున్నారు. కాబోయే లాయర్లు ఎలా బ్రతకాలి? అనే బులిటెన్ చూడండి. అలాగే చట్టసభల్లో చట్టం చేసేవాళ్ళు బ్రతకాలంటే ప్రజలకు లేమి రావాలి. ఎలా అని కొందరు కొన్ని ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నారు. (వివరాలకు సంక్షేమ పథకాలు అవసరమా? అనే బులిటెన్ చూడండి
         అలాగే ప్రస్తుతం కంప్యుటర్ నాలెడ్జి ,ఇంటర్ నెట్ నాలెడ్జి లలో రకరకాల చదువులు చదివి మరియు ఎం బి ఏ లు చదివినవారు బ్రతకాలంటే ఎలా? అందులో భాగమే ఆన్ లైన్ వ్యాపారం. అందులో ఎన్నో రకాలు వున్నాయి. ఎన్నో స్థాయిల్లో వున్నాయి. ఎన్నో సంస్థలు వున్నాయి. ఇందులో వ్యాపారం చేయాలి అని స్వంతంగా ఒక ల్యాప్ ట్యాప్ కలిగివుండాలి. వర్కింగ్ క్యాపిటల్ క్రింద కనీసం 10 వేలు అయినా పెట్టుకుని వస్తువులు తీసుకుని, పిన్నులు తీసుకుని, ప్రజల వద్దకు వెళ్లి వ్యాపారం గురించి చెప్పండి. ల్యాప్ ట్యాప్ లో చూపండి. వస్తువులు అమ్మండి. కాని తప్పనిసరిగా బ్యాంకు అకౌంటు ఉన్నవారికి మాత్రం అమ్మండి. కంప్యుటర్, ఇంటర్నెట్ తెలియని వారికి కూడా అమ్మండి. కాని వారికి అన్ని, అంటే దరఖాస్తు వివరములు మీరే పూర్తి చేయండి. అంతేకాదు ప్రతినెల వారివి  అప్ డేట్ చేయండి. వ్యాపారానికి కావలసింది నమ్మకం. అది సంపాయించండి  ప్రజల దగ్గర.

నో సర్వీస్ - నో బిజినెస్ 
         ఒక ఎల్. ఐ.సి. ఏజంటు తన పాలసీ హోల్డర్లకు ఎలాంటి సేవ చేస్తాడో అలాగే మీరు మీ కస్టమర్లకు సేవ చేయండి. వారికి కంప్యుటర్, ఇంటర్నెట్ నాలెడ్జి లేని వారు కనుక మీరు వారికి సర్వీసు చేయక పోతే వ్యాపారం మంచిగా జరగదు.



           ఆ సేతు హిమాచలం మానవాభి వృద్ధిలో మహోజ్జ్వలం 
            మానవాభి వృద్ధిలో 60 వసంతాల గణతంత్ర భారత్ సాధించిన ప్రగతి అనన్య సామాన్యం...... అంటూ చాలా వ్రాసారు. 26 -1 -2010 న ఈనాడు  దినపత్రికలో. అది వారి తప్పుకాదు. అది ఒక వార్త. ప్రచురించారు. అంతే. వార్త వచ్చినందుకే ఆలోచించడానికి అవకాశం.
            ఇంకా వివరాల్లోకి వెళ్ళితే ....... లక్ష మంది ప్రజలకు ఆనాడు 16 మంది వైద్యులు వుండేవారు. ఈనాడు ఆ సంఖ్యా  60 మందికి చేరింది అని వ్రాసారు. ఇది మానవాభి వృద్ధిలో కి వస్తుందా? రాదా? ఆలోచించండి. మేధావుల్లారా! 
             ఆనాడు అంటే 1950 లో 1 ,00 ,000 మందికి 16 మంది డాక్టర్లు. అది ఎక్కువా? తక్కువా? అనేది ఆనాటి జనాభా సంఖ్యను బట్టి చెప్పాలి. అలాగే చెప్పాము అనుకుందాము. మరి వైద్యుల సంఖ్య పెరిగితే ప్రగతా? ప్రజలు ఆరోగ్యంగా వుంటే ప్రగతా? అని ప్రశ్నించుకుంటే ప్రజలు ఆరోగ్యంగా వుంటే ప్రగతి అని అందరూ అంటారు. ఆరోగ్యం అంటే ఏమిటి? (వివరాలు పర్యావరణాన్ని పాడు చేద్దాం రండి అనే బులిటిన్ లో చూడండి )
              కానీ, ప్రజల్లో ఒక భాగమైన డాక్టర్లు కూడా బ్రతకాలి కదా! అందుకే ప్రజలు అనారోగ్యంగా ఉండటమే ప్రగతి అని కొందరు మేధావులు వారి కోసం ప్రజలకు ఎలా జబ్బులు రావాలో కనిపెడుతూ వచ్చారు. అందులో భాగంగా రసాయనిక ఎరువులు కనిపెట్టి, ఉపయోగించి, వ్యవసాయం నేర్పించారు. రైతులకు, మిగిలిన ప్రజలకు అనారోగ్యాలు వచ్చేలా ఆలోచించారు. ఇటు ప్రజలను, అటు భూమాతను అనారోగ్యం పాలు చేసారు.ఆలోచించండి. మేదావుల్లారా! ఇప్పుడు అది కాదు పాయింటు. డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనేది సమస్య? ఎందుకంటే 
ప్రతి 6 నెలలకు ఒకసారి (1950 లో) 
          1950 లో 1 ,00 ,000 మందికి 16 డాక్టర్లు వున్నప్పుడు . . . .  ఉదా||కు 1 ,00 ,000 /16 =6 ,250 మంది పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  రోజుకు 8 గం|| ప్రాక్టీసు చేస్తే అందులో గంటకు 4 చొప్పున పరీక్ష చేస్తే 32 మందికి పరీక్ష చేయవచ్చును. ఆ ప్రకారముగా నెలకు 32 x 30 = 960 మందికి అంటే సుమారు నెలకు 1 ,000 మందికి పరీక్ష చేయవచ్చును. ఈ 1 ,000  మంది ప్రతి నెలా పేషంట్ల రూపంలో రాగలరా? రాలేరు. పోనీ, ప్రతి 6 నెలలకు ఒకసారి రాగలరా? వచ్చారు అనుకుందాం. అంటే ఒక్కొక్క డాక్టరుకు 6 ,000 మంది పర్మనెంటు పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ. (ఒక్కొక్క పేషంటు అప్పట్లో 1 రూపాయి యిచ్చినా నెలకు 1000 రూపాయలు ఆదాయం. అంటే 1950 లో ఒక ఐ.ఏ.ఎస్. నెల జీతం (రూ|| 350 /-) కంటే దాదాపు ౩ రెట్లు ఎక్కువ.)  ఈ లెఖ్ఖల ప్రకారం ఎన్ని మెడికల్ కాలేజీలు వుండాలి. ఎంత మంది భవిష్యత్తులో డాక్టర్లు కావాలి అని బడ్జెట్టు వేసుకుని వుంటే ఈనాడు డాక్టర్లు ఎలా బ్రతకాలి అని ఆలోచించాల్సిన పని లేదు. ఆలోచించండి మేధావుల్లారా! ముఖ్యంగా యువతలోని మేధావులు. (వివరాలకు అవసరానికి మించి వుంటే తప్పదు ఆర్ధిక సంక్షోభం బులిటెన్ లో చూడండి)
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo  
-------------------------------------------------------------------------------------------------
ప్రతి 3 నెలలకు ఒకసారి (2010 లో) 
          2010  కి 60  మంది డాక్టర్లు ఉండేలా ప్రగతి సాధించింది అని అంటున్నారు. అంటే మన దేశ జనాభాకు (1 ,30 ,00 ,00 ,000 /1 ,00 ,000 x 60 = 7 ,80 ,000 డాక్టర్లు  వున్నట్లు లెఖ్ఖ. ) అంటే ఉదా||కు 1 ,00 ,000 /60 = 1 ,600  మంది పేషంట్లు  ఒక్కొక్క డాక్టరుకు  వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  (రోజుకు 8 గం|| ప్రాక్టీసు చేస్తే ) 1 ,000 మంది పేషంట్లు కావాలి. ఈ లెక్కన పేషంట్లు కనీసం రెండు నెలలకు ఒకసారి వచ్చి తీరాలి? ఎలా?  . . . జనాభాను పెంచలేరు. ఎందుకంటె, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రవేశ పెట్టిందే డాక్టర్లకు పేషంట్లు రావడానికి కదా! అయితే ఎలా? అని ఆలోచించి కొందరు మేధావులు 1950 నుండి సేంద్రియ వ్యవసాయాన్ని దూరం చేసి, రసాయనిక ఎరువులతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, ఒక వైపు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసారు. మరో వైపు భూసారాన్ని నాశనం చేసారు. ఇంకా రకరకాలుగా ఆరోగ్యాలను చెడగొట్టడానికి పెద్దలకు స్లో పాయిజన్ లాంటి గుట్కాలను, ఆల్కహాల్ ను , పిల్లల మీద రెడి మేడ్ ప్రాసెస్డ్ పేకేజేడ్ ఫుడ్ ను , విష రసాయనాలతో నిండిన బొమ్మలను (వివరాలకు ఆటబోమ్మలో విషరసాయనం బులిటెన్ చూడండి ) ప్రయోగిస్తున్నారు. మహిళలకు కూడా వారికి తగినట్లుగా ప్రయోగిస్తున్నారు. (వివరాలకు గర్భిణీ స్త్రీలు షుగరు పేషంట్లే బులిటెన్ చూడండి.)
బి. టి. ప్రత్తి, బి.టి.కూరగాయలు 
         భారతీయులు నూలు వస్త్రాలు ధరించి ఆరోగ్యంగా వున్నారని బి.టి. ప్రత్తిని  ప్రయోగించి, చివరకు కాటన్ దుస్తులు ధరించిన వారికి చర్మ వ్యాధులు వగైరా అనారోగ్యాలు వచ్చేలా  చేస్తున్నారు. అందరూ మెచ్చే వంకాయ కూర విషయంలో  కూడా ఇదే రహస్యం. ఇప్పుడు అది కాదు పాయింటు. కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనేదే సమస్య.
          ఎందుకంటె . . . . . అవసరానికి మించిన డాక్టర్లు వుంటే ప్రగాతా? పతనానికి నాందియా? ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు. 
ఆరోగ్య శ్రీ పథకం 
         ఈ ప్రకారంగా అన్నిరకాల (వైద్య) పాత కుల వృత్తులలోనూ, కొత్త రకం కుల వృత్తులలోనూ, అవసరానికి మించి వున్నారు. అందుకే లాభాల కోసం వ్యాపారస్తులు  తయారుచేసిన వస్తువుల విషయంలోనూ, బట్టల విషయం లోనూ, ఒకటి కొంటె ఒకటి ఉచితం అంటున్నారు. వారికి నష్టాలు రాకుండా ప్రభుత్వం ప్యాకేజీలు యిస్తుంది. డాక్టర్లకు నష్టాలు రాకుండా ఆరోగ్య శ్రీ పథకం అనే పేరుతో నడుపుతున్నారు. ఇది ఎంత కాలం? డాక్టర్లను శాశ్వతంగా ఆరోగ్య శ్రీ పథకంలో పోషించాలంటే ప్రజలకు జబ్బులు ప్రతి సంవత్సరం రావాలి.  అలాగే ఎన్నో పథకాల కోసం ప్రజలు యిబ్బందులకు గురి కాక తప్పదు. 
మెకాలే విద్యా విధానం 
       ఇలా ఎందుకు జరుగుతున్నదంటే మనం భారతీయ సంస్కృతిని, విద్యా విధానాన్ని మరచి, మెకాలే విద్యా విధానాన్ని,విదేశీ సంస్కృతిని నమ్ముకున్నందుకే .
ఆలోచించండి మేధావుల్లరా! 
          ఈ బులిటెన్ను చదివిన Bi .P .C . విద్యార్థులు, తల్లిదండ్రులు, మేము దాక్తర్లుగానే చదువుతాం, చదివిస్తాం అంటే అది మీ ఇష్టం. కానీ ఇది సత్యం అని గ్రహించిన వారు ''చక్కటి ఆరోగ్యం చక్కటి ఆహారం వలన వస్తుంది .డాక్టర్ల వలన రాదు'' అని అలోచించి , రసాయనిక ఎరువులతో కాకుండా సేంద్రియ ఎరువులతో వ్యవసాయ కార్యక్రమంలో దిగితే బాగుంటుందని ఆశిస్తున్నాము. 
         రాజులను విభజించారు. పాలించారు. పర్యవసానం అందరికీ తెలిసిందే.
        ఉమ్మడి కుటుంబాలను విభజించారు. చిన్న కుటుంబాలను చేసారు. ఆ చిన్నకుటుంబాన్ని మరీచిన్నది చేసి ఒకవ్యక్తియే  ఒక కుటుంబం అన్నట్లు చేసారు. దాని పర్యవసానమే ఆర్ధిక సంక్షోభం , కాలుష్య ప్రగతి , అధిక ధరలు యిలా ఎన్నో? ముఖ్యంగా  మనుషులకు టెన్షన్స్ (మరి డాక్టరు బ్రతకాలి కదా! సమస్యలను పంచుకుంటే తరుగుతుంది. లేదంటే పెరుగుతుంది. పంచుకోవడానికి ఉమ్మడి కుటుంబంలో మాత్రమే వీలౌతుంది.) ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు. 
        విద్యను విభజించారు. దాని పర్యవసానం అసంపూర్ణ విద్యతో  అందరూ అన్ని రకాల సమస్యలతో బాధ పడుతున్నారు. ఉదా|| వైద్య విద్యను విభజించారు. పేషంట్ల సంఖ్యను  పెంచారు. 
        పాలను వెన్న తీసిన పాలుగా విభజించారు. సంపూర్ణ  ఆహారం అనేదాన్ని విచ్చిన్నం చేసి అనేక రకాల జబ్బులకు కారణం అయ్యారు. 
        వ్యవసాయంలో మిశ్రమ పంటలను విభజించారు. భూమాతను నాశనం చేసారు.
        ఉమ్మడిగా వున్న పాడిపంటలును రెండుగా (అగ్రికల్చర్, డైరీ) చీల్చారుపొలంగట్ల మీద అనేక రకాల వృక్షాలను పెంచే సాంప్రదాయాన్ని విడగొట్టారు. సేంద్రియ వ్యవసాయానికి అడ్డుకట్ట వేసారు. రైతులను నాశనం చేసారు.
ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోనే మేధావులు. 
          ఎవరు పాలిస్తునారు అనేది కాదు ప్రశ్న? ఎందుకు పాలిస్తున్నారు అనేది పాయింటు. ఎందువలనంటే కేవలం మన భారతీయ సంస్కృతిని, విద్యా విధానాన్ని కాలదన్ని మెకాలే విద్యావిధానాన్ని కౌగిలించుకున్నందుకు. మన భారతీయ సంస్కృతి అయిన కలిసుంటే కలదు సుఖం, ఉమ్మడి కుటుంబ సాంప్రదాయాన్ని వదిలి బ్రిటీషు వారిచ్చిన విభజించు, పాలించు వారసత్వాని పట్టుకుని ఊగుతున్నందుకే. ఆలోచించండి. మేధావుల్లరా! 
స్వాతంత్ర్యం వచ్చిందా!
         1947 లో స్వాతంత్ర్యం వచ్చిందంటున్నారు. వచ్చింది భూభాగానికే కానీ, సంస్కృతికి, భారతీయ విద్యకు రాలేదు. ఇది యింకా విదేశీ మెకాలే పద్ధతిలో నే సర్వనాశనం అవుతూవున్నది. 
         (ఆనాడు, అశోకుడు కానీ, అలెగ్జాండరు కానీ,యుద్ధాలు చేసి ప్రపంచాన్ని కావచ్చును, లేదా, వీలయినన్ని దేశాలు కావచ్చును ఒకే గొడుగు క్రిందకు ఎందుకు తెచ్చేవారంటే ప్రజలందరికీ ఒకే న్యాయం, ఒకే పద్ధతి, ఒకే చట్టం, ఒకే విద్యా యిలా ఎన్నో యూనివర్సల్ గా ఒకే రకంగా వుండాలని. కానీ ఒక గొడుకు క్రిందకు తెచ్చే సరికి ప్రజలు వుండరు చనిపోతారు. అక్కడే కొంచెం  బాధ కలుగుతుంది  )
         కానీ, 1947 లో బ్రిటీషు వాళ్ళు మనల్ని వదలి పోతూ మనకిచ్చిన వారసత్వ సంపదను మనవాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అదే నండీ. డివైడ్ అండ్ రూల్ పాలసీని. ఎలాగంటే... స్కూల్లో ప్రతిజ్ఞ (PLEDGE) భారతీయులందరూ నా సహోదరులు అని అంటూ రాష్ట్రాలుగా విభజించి, వివిధ రకాల న్యాయాలు, చట్టాలు, విద్యలూ, పన్నులూ, ఎలా ఎన్నో.
          భారతీయులందరికీ ఒకే రకమైన చదువు లేదు. ఒక రాష్ట్రం లో విద్య ఉచితం. ఒక రాష్ట్రం లో కొనుక్కోవాలి. ఒక రాష్ట్రం లో వైద్యం ఉచితం. ఒక రాష్ట్రంలో కొనుక్కోవాలి. ఒక్కొక్క రాష్ట్రం లో ఒక్కొక్క విధంగా కూలీలు, వేతనాలు, రవాణా చార్జీలు, పన్నులు. 
          అఖండం గా భారత దేశాన్ని ముక్కలుగా  చేసి రాష్ట్రాలు అన్నారు. కనీసం ఇప్పటివరకు రాష్ట్రంలో నైనా ఒకే విద్య వైద్యం న్యాయం చట్టం వుందని సంతోషించాము. ఇప్పుడు దాన్ని కూడా వివిధ ముక్కలుగా చేసుకుని వివిధ రకాల విద్యను, వైద్యాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నాము. 
ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు.
          1 .   ముందుగా విడాకులు తీసుకోకుండా భార్యా భర్తలు కలసి వుండేది నేర్చుకోవాలి. 
          2 .   అన్నితరాల వారు ఉమ్మడి కుటుంబం గా ఉండటం నేర్చుకోవాలి. 
అప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్ కాదు, అఖండ భారత దేశమే సంపాయించగలం.
         3 . మనసుండి సరైన ప్లానింగ్ ఉండాలే గానీ, అఖండ ప్రపంచాన్నే (ప్రపంచం మొత్తం మీద ఒకే కరెన్సీ, ఒకే ధరలు, ఒకే న్యాయం  ఒకే చట్టం, ఒకే వైద్యం ఒకే విద్య ఒకే రవాణా చార్జీ. ప్రపంచమంతా లోకల్ కాల్ ) సాధించగలం
 
 ఆటోల రూటే సపరేటు. తిరుపతి లో ఇష్టా రాజ్యం. 
ఎక్కితే రూ 20 /- ఇచ్చుకోవాల్సిందే

.......................ఇంకా వుంది




                                                          
       




         బులిటెన్ 4 మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది..........త్వరలో.....  
బులిటెన్ 5    అఖండ ఆంద్ర - సమైఖ్య ఆంద్ర ........ త్వరలో  .......
బులిటెన్ 6  వారంతా గ్రామ దేవతలే .......... త్వరలో ................. 
బులిటెన్ 8 అవసరానికి మించి వుంటే తప్పదు ఆర్ధిక సంక్షోభం ........  త్వరలో
బులిటెన్ 9  ఒకే రోజు మూడు బ్యాంకులు క్లోజ్............త్వరలో ..................... 
అధిక ధరల నియంత్రణ చైతన్య బులిటెన్ లు త్వరలో ................. 
బ్రిటీషు వాళ్ళు ఎందుకు మనదేశం వదిలి వెళ్లారు?..........త్వరలో 


                   ఇందులో ఏది ముందు కావాలో కామెంట్స్ లో తెలుపండి  
DUE TO POLLUTION LOVERS 
BHAGAWAN SRI SATHYA SAI BABA 
FELL IN SICK


          భగవాన్ శ్రీ  సత్యసాయిబాబా వారు 28 - 3 - 11  న హాస్పిటల్లో చేరారు. 4 - 4 - 11 మరింత సీరియస్ అయ్యింది అన్నారు. 6 - 4 - 11 న వార్తల్లో  ''కొద్ది రోజులుగా బాబా అనారోగ్యంగా వున్నారు'' అంటూ రకరకాలుగా చెబుతున్నారు. వారికి అంతే తెలుసు. బాబా వీల్ చైరులో దర్శనం    ఇచ్చేటప్పుడు ఆరోగ్యంగా వున్నారా? అప్పుడు కూడా లేదు. ( బాబా మాత్రమే కాదు, చాల మంది హాస్పిటల్లో చేరితేనే అనారోగ్యం అని అనుకుంటారు. ఇంట్లో ఉన్నంత మాత్రాన , ఎవరి పనులు వారు చేసుకుంటున్న మాత్రాన ఆరోగ్యం గా వున్నట్లు లేక్కేనా? కాదు.) ( వివరాలు సంపూర్ణ ఆరోగ్యం బుల్లెటిన్లో చూడండి
ఎందుకు వీల్ చైర్లో దర్శనం యిస్తున్నారు
          మరి చాల కాలంగా బాబా ఎందుకు వీల్ చైర్లో దర్శనం యిస్తున్నారు? దానికి సమాధానమే ఈ బుల్లెటిన్. వీల్ చైర్లో కాకుండా బాబా సంపూర్ణ ఆరోగ్యంగా వున్నప్పుడు ఎంతోమంది భక్తులకు క్షణాల్లో, నిముషాల్లో, ఎంతో దూరంలో ఉన్నవారికి కూడా ప్రశాంతి నిలయం నుండి కదలకనే వైద్యం చేసారు. ఆ విషయం  వైద్యం చేయించుకున్న పేషంట్లకు, ఆపరేషన్ సమయంలో వున్న డాక్టర్లకు అనుభవం. అలాగే కొన్ని సందర్భాల్లో భక్తుల అనారోగ్యం తను తీసుకుని, తన ఆరోగ్యాన్ని భక్తులకు యిచ్చారు. అది వారి వారి విశ్వాసం మీద ఆధారపడి వుంటుంది.
          ఉదాహరణకు ఈ బుల్లెటిన్ వ్రాస్తున్న నేను కూడా ఎన్నో మార్లు చిన్న చిన్న అనారోగ్యాల పాలైనప్పుడు '' బాబా '' అంటే '' బంగారూ'' అంటూ ఆరోగ్యాన్ని ప్రసాదించారు. అలాంటి అనుభవం  ఉన్నప్పటికీ  నేనుకూడా కొన్నిసందర్భాలలో (ఇతరుల ప్రలోభాలకు గురై అంటే నా చుట్టుపక్కల బంధువుల , మిత్రుల ప్రభావానికి గురై , వారి సంతోషానికి కావచ్చు , లేదా బాబా మీద విశ్వాసం  సడలి కావచ్చు ) టాబ్లెట్లు , రక్త పరీక్షలు, టానిక్కులు, తీసుకున్నాను.  మరి నాకు సంపూర్ణ విశ్వాసం వున్నదా? లేదు. నాలాంటి వారు ఎందరో ఉండవచ్చు . ఆ ప్రకారంగా కాకుండా అంటే ఎవరి ప్రలోభాలకు లొంగకుండా  పూర్తిగా బాబా మీద ఆధారపడే వారు వున్నారా? ఎంతమంది వున్నారు? వారు ధనికులా? పేదలా? భారతీయులా? విదేశీయులా?..... అది  ఇప్పుడు అప్రస్తుతం. పైగా ఆ విషయాన్ని ఎవరూ చెప్పలేరు? చివరకు బాబాను అడిగినా చెప్పరు? బాబా ఒక చిన్న నవ్వు సమాధానం యిస్తారు. అంతే.
           అన్ని యుగాలు ఒక దాని తర్వాత ఒకటి సర్కిల్ మాదిరి తిరుగుతున్నాయి. ఈ విషయం చాల మందికి అర్థం కాదు. కేవలం ఒక కృతయుగం, ఒక త్రేతా యుగం, ఒక ద్వాపర యుగం జరిగినట్లు, అవి ఎన్నో లక్షల సంవత్సరాలు అన్నట్లు, ప్రస్తుతం జరుగుతున్నది కలియుగం అని అది ఎన్నో లక్షల సంవత్సరాలు అని అంటుంటారు. అది సత్యం కాదు. ఎన్నో కృతలు, ఎన్నో త్రేతలు, ఎన్నో ద్వాపరలు, ఎన్నో కలియుగాలు తక్కువ తక్కువ సంవత్సరాల కాలంతో  సర్కిల్ గా , రొటేషన్ పద్ధతిలో  జరుగుతూ వున్నాయి. ఇది సత్యం. ఇదే సత్యం.  ఆ ప్రక్రియలో ఒక త్రేతలో రాముడు, ఓక ద్వాపరలో కృష్ణుడు వున్నాడు. ఒక కలిలో శ్రీనివాసుడు వున్నాడు. అంతే. (వివరాలు యుగాల కథ  బుల్లెటిన్లో చూడండి )  అయితే యిప్పుడు ఏ యుగం అని నేను చెప్పితే ఎవ్వరికీ అర్థం కాదు. యిదివివరాలు ధ్యానంలో  ఏమేమి తెలుసుకోవచ్చు? బుల్లెటిన్లో చూడండి
దేవతలు, మానవులు, రాక్షసులు 
          ప్రతి  యుగంలోనూ అంటే కృత, త్రేతా, ద్వాపరలలో దేవతలు, మానవులు, రాక్షసులు, అని విన్నాము. అయితే మూడు రకాలకు  ప్రత్యేక రూపాలను  సంపూర్ణంగా చూడాలంటే కృత యుగంలో వర్ణించారు కవులు. 75  %  త్రేతలో వర్ణించారు. 50 % ద్వాపరలో వర్ణించారు.( ఇది కవుల రచన కల్పనా విశేషం) (వివరాలు రాక్షసులు, మానవులు, దేవతలు  బుల్లెటిన్లో చూడండి
          యోగ అనే పదం దైవత్వం. యోగులు దేవతలు. 
          సైన్సు అనే పదం రాక్షసత్వం . సైంటిస్టులు అనేవారు రాక్షసులు.       
         దేవతలలో సృష్టికర్త బ్రహ్మతో పాటూ చాలామంది వున్నారు సృష్టి లో  పాలు పంచుకున్నవారు. కానీ, అందరినీ బ్రహ్మలు అనరు.   రాక్షసులలో ప్రతి సైంటిస్టు ఒక సృష్టికర్త . మంచిదే. సైంటిస్టులను తప్ప పట్టకూడదు. వారికి కూడా నమస్కరించవచ్చు . 
సైంటిస్టులు బ్రహ్మతో సమానం 
             బ్రహ్మ  సృష్టించిన వాటిలో కొన్నింటిని అంటే  పులిని, సింహాన్ని బోనులో పెట్టినట్లు, సైంటిస్టులు సృష్టించిన వాటిలో  కొన్నింటిని బొనులో  పెట్టడం లేదు. అందుకే......దాని పర్యవసానమే బాబా అనారోగ్యానికి కారణం.
          అన్ని యుగాల్లోనూ రాక్షసులు అనే వారు పంచభూతాలైన గాలి,నీరు, భూమి, అగ్ని, ఆకాశాలను  వారి వారికి  తెలిసిన విధంగా రకరకాలుగా నాశనం చేస్తూనే వున్నారు.  (ఉదాహరణకు త్రేతలో యాగం చేసేది పంచభూతాలను కాపాడటానికి. అందులో రాక్షసులు రక్తం, మాంసం వేసేది పంచభూతాలను పాడు చేయటానికి.)
          ప్రస్తుతం అంటే 200 సంవత్సరముల  నుండి సైన్సు , సైంటిస్టులు , అభివృద్ధి అంటూ పంచభూతాలైన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశాలను నాశనం చేస్తున్నారు. అంటే పర్యావరణాన్ని (వాతావరణం, జలావరణం , శిలావరణం , జీవావరణం వగైరా) పాడుచేయటానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.  అంటే 
          గాలి కాలుష్య ప్రేమికులు గా కొందరు,
          నీటి కాలుష్య ప్రేమికులుగా కొందరు,
          భూమి కాలుష్య ప్రేమికులుగా కొందరు, 
          ఆకాశం కాలుష్య (గ్లోబల్ వార్మింగ్)  ప్రేమికులుగా కొందరు,
         అగ్ని కాలుష్య ప్రేమికులుగా కొందరుగా తయారవుతున్నారు. అంటే పిల్ల రాక్షసులుగా తయారవుతున్నారు. పూత పిందెగా మారేటప్పుడు  అందులో తియ్యదనం వస్తుందా? పుల్లదనం వస్తుందా? అలాగే  పుట్టుకతో అందరూ దేవతలే అయినా  పెరిగే కొద్దీ, కొందరు దేవతలుగానే మిగులుతారు కొందరు మానవులుగా, కొందరు రాక్షసులుగా మారుతారు. 0 (జీరో)  మానవత్వం   అనుకొంటే +1 ,+2 . . . . . దైవతం, -1 ,-2 . . . . .రాక్షసత్వం.(వివరాలు రాక్షసులు, మానవులు, దేవతలు  బుల్లెటిన్లో చూడండి
           ఈ కాలుష్య ప్రేమికుల వలన అనేకమందికి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. ప్రస్తుతం సంపూర్ణ విశ్వాసం కలిగిన బాబా భక్తులు ఎంతమంది వున్నారో తెలియదు. కానీ, 1960 లో కంటే 1970 లో ఎక్కువ. 70 లో కంటే 80 లో ఎక్కువ. ఈ ప్రకారంగా మరింత పెరిగి 2000 ఎంత మంది చేరుకున్నారో తెలీదు. అందులో ఆ భక్తులను కాపాడటానికి  నిరంతరం వీల్ చైర్ లో అతుక్కుపోయారు బాబా. ఈ  విషయం చాలామందికి అర్థం కాదు. అయితే అలా అతుక్కునే అయన తన 96 సంవత్సరాలు పూర్తి చేసి ఉండవచ్చు. కానీ, సడన్ గా సీరియస్ గా 28 - 3 - 11 న హాస్పిటల్లో చేరడం, 4 - 4 - 11 న మరింత సీరియస్ కావడానికి కారణం జపాన్ భూకంపం. తద్వారా రేడిఏషన్ అందులోని విషవాయువులు పంచభూతాలద్వారా ప్రయాణించి అనేకమందికి అనారోగ్యం కలిగింది. అందులో బాబా యొక్క సంపూర్ణ విశ్వాసం కలిగిన భక్తుల సంఖ్యలో వరుసగా ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యం కంటిన్యుస్ గా చెయిన్ లాగ రావడం వలన బాబాకు ఎక్కువ సీరియస్ అయ్యి హాస్పిటల్లో చేరారు. 
వీల్ చైర్ నుండి బాబా లేచి మామూలుగా నడిచే సమయం 
             సంపూర్ణ విశ్వాసం కలిగిన బాబా భక్తులను  కాపాడే ప్రక్రియలో అందరూ ఆరోగ్యవంతులయితే బాబా వీల్ చైర్ లేకుండా మామూలుగా నడుస్తూ పాద నమస్కారం యిస్తారు. చక్కగా రధాన్ని తోలుకుంటూ ఆశ్చర్య చకితుల్ని చేస్తారు.  అయితే అది సాధ్యమా? అంటే ఆలోచించాలి. ఎవరు? మేధావులు? (వివరాలు మేధావులంటే ఎవరు? బుల్లెటిన్ చూడండి. ) కనీసం మేధావులు ఆలోచించక పోయినా ధర్మ సంరక్షనార్థం సాయి భక్తులు ఆలోచించాలి. 
            బాబా వీల్ చైర్లో నుండి లేచి నడిచి పాద నమస్కారం  ఇవ్వాలంటే కాలుష్య ప్రేమికులు తగ్గాలి. కాలుష్య ప్రోత్సాహకులు తగ్గాలి.
            ఒక్క క్షణం ఆలోచించండి సాయి భక్తులారా! పర్యావరణాన్ని కాపాడం అంటే కాలుష్యాన్ని తగ్గించడమే. ఈ విషయం తెలీని మేధావులు ఒక వైపు కాలుష్యాన్ని పెంచుతూ, పర్యావరణాన్ని  కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎలా వీలవుతుంది. వాటర్ ట్యాంక్ కొళాయి  ఓపన్ చేసి ట్యాంక్  నింపడం సాధ్యమా? అందుకే సాయి భక్తులు కొళాయి కట్టే ప్రక్రియలో పాల్గొనండి . ప్రతి సంవత్సరం స్వామి వయస్సు ఆధారంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టుతున్నారు కదా! అలాగే ప్రస్తుత వయస్సు ఆధారంగా అన్ని రోజులు అంటే 86 రోజులు మీ స్వంత వాహనాలైన  టూ వీలర్స్ కు, ఫోర్ వీలర్స్ కు సెలవు చెప్పండి. 86 రోజులు అవసరం అయితే నడవండి, సైకిల్ వాడండి, లేదా తక్కువ కాలుష్య కారకాలైన ప్రజా వాహనాలను వాడండి. ధర్మ సంస్థాపనలో పాల్గొనండి. స్వామిని నడిపించి సాయి భక్తులు కాని వారికి ఆదర్శంగా వుండండి.
          మరి ఈ విషయం బాబా ఎప్పుడూ చెప్పలేదే అంటారు చాలామంది. ఆయన చెప్పరు. ఎందుకంటె, ( వివరాలకు కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి బుల్లెటిన్ చూడండి) బాబా వారు ''సర్వే జనా సుఖినో భవంతు ''అంటారు కదా! అందుకే చెప్పరు. కాబట్టి కాలుష్య కారకులను కూడా పోషించారు బాబా.
           ఈ అవతారం లోనే కాదు ప్రతి అవతారం లోనూ ప్రతి యుగం లోనూ కాలుష్య ప్రేమికులు వుండారు. వుండాలి. అదే ధర్మం. కానీ ధర్మం, అధర్మం బాలన్సు గా వుండాలి. 50 % ధర్మం. 50 % అధర్మం. అలా కాకుండా అధర్మం % పెరిగితే బాలన్సు చేయడానికే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి  యుగే యుగే అంటారు. (వివరాలకు ధర్మం ఎన్ని రకాలుగా తప్పుతుంది. అనే  బుల్లెటిన్ చూడండి)  ఏ యుగంలో అయినా, ఏ అవతార పురుషుడైన  అయినా, 100 % ధర్మాన్ని సంస్థాపన చేయడు. ఎందుకంటె, ధర్మాన్ని గుర్తించడానికి అధర్మం వుండాలి.
ఏవైనా నార్మల్ గా వుండాలి
         మన చొక్కా  సైజు అయినా, కాలి చెప్పు అయినా, కరక్టు సైజులో వుండాలి. పెద్దదైనా, చిన్నదైనా  సమస్యే. ఈ వాక్యాలు గతంలో విన్నవారంతా ధన్యులు. విని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టిన వారు మరింత ధన్యులు. (అర్థం కాని వారికోసం, అర్థమయ్యే విధంగా,) బి. పీ. షుగరు, గ్యాసు, లాంటివి ఏవైనా నార్మల్ గా వుండాలి. లేదంటే (ఎక్కువైనా, తక్కువైనా) సమస్యే,  అలాగే గుణాలు కూడా నార్మల్ గా వుండాలి. సత్య, ధర్మాలు ఎక్కువైనా సమస్యే, శాంతి, ప్రేమలు, ఎక్కువైనా సమస్యే. బి. పీ. షుగరులు హెచ్చు తగ్గులను అనుభవించిన వారికి తెలుసు దాని విషయం. అలాగే, సత్య,ధర్మాలు , శాంతి,ప్రేమలు, ఎక్కువ అనుభవించిన వారికి ఈ విషయం తెలిసే వుంటుంది. మిగిలిన వారికీ అర్థం కాదు. 
           అందుకే ప్రజల్లో ఒక భాగమైన కాలుష్య కారకులను కూడా ప్రోత్సహించారు. ఆదరించారు. (ఏ యుగంలో నైన , ఏ అవతారంలోనైన  అధర్మాన్ని ధర్మం దారిలోనికి తేవడానికి, కొన్ని శాపకారణాలుగా అధర్మ పరులును  రాక్షస వంశంలో పుట్టిస్తాడు అవతార పురుషుడు.) అయితే అది ఎంత కాలం? రాముడు అయోధ్య నుండే లంకలోని రావణున్ని చంపగలడు. శ్రీ కృష్ణుడు చంటిపాపగానే కంసున్ని, శిశుపాలున్ని  చంపి ఉండవచ్చు. కానీ, సమయం ఆసన్నం కావాలి అని చెప్పవచ్చు, లేదా సామ, దాన, బేధ, దండోపాయాలు అని చెప్పవచ్చు , లేదా 100 తప్పులు వరకు క్షమించడం లాంటిది కావచ్చు. అప్పటివరకు అవతార పురుషులు  ఓర్పు వహిస్తారు. ఆ పైన ధర్మ సంస్థాపన అంటే బ్యాలన్సు చేయడానికి ప్లాను వేస్తారు.
            కాబట్టే, బాబా యిప్పటి వరకు పంచ భూతాలను కాపాడండి  అని డైరెక్టు గ అని చెప్పలేదు. కానీ ఇండైరక్టు గా ఎప్పుడో చెప్పారు. ఎన్నో సార్లు చెప్పారు, ఆచరించి చూపారు. భక్తులంత ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఉదాహరణకు కొన్ని మాత్రమే చెప్పారు, చూపారు.
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo
-------------------------------------------------------------------------------------------------
             
             పంచ భూతాలను కాపాడక పోతే ఏమవుతుందో 
             ప్రాక్టికల్ గ చూపిస్తున్నారు. ఇదొక  అనుభవం అందరికీ. 
             ఈ అనుభవంతో మరి పంచభూతాలను కాపాడని వారు 
             మూర్ఖులు. వారే అధర్మ పరాయణులు. వారే రాక్షసులు. 
            
           చేసే వాడు, చేయించే వాడు అన్నీ బాబాయే. 
           మనం ఆయన చేతిలో పనిముట్లం మాత్రమే. 
           అయన నాటకంలో పాత్రధారులం అని గ్రహించగలిగినవారు 
           ధన్యులు. వారే ధర్మ పరాయణులు. వారే దేవతలు.
బాబా అనారోగ్యానికి ఎన్నో కారణాలు.
           కర్ణుడి ఓటమికి ఎన్నో కారణాలు. అలాగే బాబా అనారోగ్యానికి ఎన్నో కారణాలు. అది సత్తెమ్మ తల్లి  కావచ్చు ( మన పిల్లవాడికి చెయ్యి ప్రమాదంలో విరిగిందని నడిరోడ్లో వదిలేస్తామా! వైద్యం చేయిస్తాం. అప్పటికీ కాకపోతే కనీసం ఇంట్లో ఉంచుకుంటాం. అంతే కాదు గతంలో కంటే మరిన్ని సేవలు చేస్తాం. పిల్లవాడిని సంతోష పెట్టడానికి, తన అనారోగ్యాన్ని మరపింప చేయడానికి ప్రయత్నిస్తాం.) వాస్తు దోషం కావచ్చు. ట్రస్టు వ్యవహారాలు కావచ్చు. పంచభూతాలు కావచ్చు. (కాలుష్య ప్రేమికులు వివరాలకు www .teambyindian .com
            సత్తెమ్మ తల్లిని తీసుకొని వచ్చారు. వాస్తు దోషం సరిచేస్తారు. ట్రస్టు వ్యవహారాల గురించి బాబా ఎప్పుడో చెప్పేసారు. బాబా తదనంతరం ఎవరు నడుపుతారో గతంలో బబాయే చెప్పారు. ఒక సారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇప్పుడున్న సమస్య అంతా ధర్మ సంస్థాపన గురించే. కాలుష్య ప్రేమికులను, పోషకులను తగ్గించగలమా? ఆలోచించండి 
         కాలుష్య సృష్టి కర్తలు, పోషకులు, ప్రేమికులు తగ్గినప్పుడు బాబా వీల్ చైర్ కూడా లేకుండా నడుస్తారు. ఇది సత్యం. ఇదే సత్యం. 
మళ్లీ భూకంపం 
           మళ్లీ మళ్లీ భూకంపాలు వస్తూ వుంటే బాబా కు సీరియస్ నెస్ కంటిన్యు అవడంలో ఆశ్చర్యపోనక్కర లేదు. ఇప్పటికే జపాను లో మార్చి సంఘటనకు 4000 వేల మంది క్యాన్సరు పేషంట్లు అని ఒక ప్రముఖ తెలుగు పత్రికలో వ్రాసారు. అందులో 1 % అయినా బాబాను నమ్మినవారు వుంటారు. మరి వారిని శిష్టులుగ భావించి సంరక్షణచేసే  పనిలో వున్నారు బాబా. జపాను భూకంపం ద్వారా వచ్చిన కాలుష్యం వాయు రూపంలో ఎంత దూరం పోతుందో, ఎంతమందిని అనారోగ్యం పాలు చేస్తుందో, అందులో శిష్టులు  ఉన్నట్లయితే బాబా వీల్ చైర్ లో నే దర్శనం  యిస్తారు. 
 ధర్మ రక్షణ లో అందరూ పాల్గొనాలి. 
          '' నాన్న! నేను అడవికి వెళ్లి రాక్షస సంహారం చేస్తాను '' అని రాముడు నేరుగా తండ్రితో అనలేదు. విశ్వామిత్రుడిచేత అడిగించాడు.  ఇది ఒక  ఉదాహరణ  మాత్రమే.  ఆ ప్రకారంగా  ఎందరినో ఉపయోగించుకున్నాడు. ఎక్కువగా అన్ని వర్గాలకు (మానవులకు, దానవులకు , దేవతలకు ) అవతార పురుషుడి  విషయాన్ని గుర్తు చేసే నారదుణ్ణి ఎక్కువగా ఉపయోగించికున్నాడు.  అలాగే శ్రీ కృష్ణుడు కూడా ఎందరినో ఉపయోగించికున్నాడు. వీలైనంత మందిని అవసరానికి తగ్గట్లుగా ఉపయోగించుకోవడం  ప్రతి అవతార పురుషుడుకి మామూలే.  అలాగే ప్రస్తుతం ధర్మసంస్థాపనలో వీలైనంత మందిని అవసరానికి తగ్గట్లుగా పాల్గొనేలా చేయడమే అయన ఉద్దేశ్యం. 
          మరి, సాయి భక్తులు, సాయి సేవకులు, సాయి సైనికులు, కాలుష్య ప్రేమికులు గా వుండి బాబాను వీల్ చైర్ లోనే ఉంచుతారా! లేక ధర్మ సంస్థాపనలో పాల్గొని పర్యావరణ ప్రేమికులు గా మారి బాబాను వీల్ చైర్ నుండి లేపి నడిపిస్తారో ఆలోచించండి.

            ఏ విషయమైనా నార్మల్ గ ఉండడమే ధర్మం.  అవి ఎన్నో రకాలు.
            పర్యావరణలో ( ప్రకృతిలో ) ఒక భాగమైన జీవావరణం. అంటే జంతు విభాగం ( మానవుడు కూడా అందులో భాగమే. అందుకే ఎలుకలమీద, పిల్లులమీద, కుక్కలమీద ప్రయోగాలూ చేస్తున్నారు. ఫలితాలు మానవునకు అందిస్తున్నారు) ఆ జంతువులను కాపాడడం అంటే మూడు పూటలా తిండి పెట్టి సోమరిపోతుల్లగా మేపడం కాదు. వాటికీ తిండి పెట్టాలి. వాటికీ వ్యాయాయం కోసం బండ్లకు కట్టి లాగించాలి. అది ధర్మం. మానవుడు పదవీ విరమణ మాదిరి  వాటికీ కూడా వుండాలి అంతే కాని ముసలిదైన చనిపోయే వరకు బండికి కట్టడం అధర్మం. కానీ, జంతు సంరక్షణ అంటూ కేవలం తిండి పెట్టి వ్యాయాయం లేకపోతే అది అధర్మం. ఎందుకు? సరియైన వ్యాయాయం లేకపోతే జబ్బులు రావడానికి ఆస్కారం వుంటుంది. అందుకే అది అధర్మం. (జబ్బులు రావాలనే అనుకుంటున్నారు డాక్టర్లు, మందుల కంపెనీ వారు
           కాబట్టి, కాలుష్య కారకాలైన ట్రాక్టర్లను ( ఇవి బ్రహ్మ కనిపెట్టిన క్రూర జంతువులతో సమానం, కాబట్టి ట్రాక్టర్లను బోనులో పెట్టాలి.) ,  టూ వీలర్స్ ను , ఫోర్ వీలర్స్ ను , ప్రక్కన పెట్టి గుర్రపు స్వారీకి, రెండెడ్ల బండికి, గుర్రప్పండ్లకు మారటానికి ప్రయతిస్తే బాగుంటుంది. 
          టూ వీలర్స్ కొనటానికి ఎంత ఖర్చు?దాన్ని మెయిన్ టెన్  చేయడానికి ఎంత ఖర్చు? ఒక గుర్రాన్ని కొనటం ఎంత ఖర్చు? దాన్ని మెయిన్ టెన్  చేయడానికి ఎంత ఖర్చు? అని ఆలోచిస్తారు చాలామంది.
        నిజమే. టూ వీలర్ కొనే ఖర్చుకి గుర్రం కొనగలమని భావిస్తున్నాను.      
     గుర్రాని స్వారీ చేయడం చేతని వాడు తన స్వార్థం కోసం సైకిలు కనిపెట్టాడు. వాడు మంచిగానే కనిపెట్టాడు. సైకిలు స్వారీ, గుర్రం స్వారీ రెండిటి వలన మంచి వ్యాయామం, పర్యావరణ పరిరక్షకాలు. కానీ, సైకిలు స్వారీ కూడా చేతకాని వాడు మోటర్ సైకిలు కనిపెట్టాడు. అదీ తప్పు లేదు. కానీ, డిమాండు (ప్రజలు అడక్క పోయినా) లేకపోయినా బలవంతంగా గుర్రాలను, సైకిళ్ళను మాన్పించి, మోటార్ సైకిళ్ళను కొనిపించిన వ్యవస్థ అధర్మంగా నడుస్తున్నది. ఆ వ్యవస్థను ధర్మం వైపు త్రిప్పాలంటే, సాయి సైనికులు గుర్రాలను, సైకిళ్ళను వాడకం పెంచుకొని, మోటార్ సైకిళ్ళ కొనుగోలుకు స్వస్తి పలకాలి.
           అలాగే తలపాగా చుట్టుకోవడం చేతకాని వాడు టోపీ కనిపెట్టాడు. పంచె కట్టు చేతకాని వాడు ప్యాంటు ను కనిపెట్టాడు. అదేమిటంటే నేససిటి యీజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాడు. ఈ ప్రకారంగా చాల కనిపెట్టాడు మానవుడు. కనిపెట్టే వాళ్ళంతా మానవులే. దేవతలనే వారు, రాక్షసులనే వారు కనిపెట్టరు. అయితే సైన్సు చదివేటప్పుడు భౌతిక ధర్మాలు, రసాయనక ధర్మాలు అని వుంటాయి కదా. అలాగే జనరల్ గా మొక్కలకు, పక్షులకు , జంతువులకు కొన్ని ధర్మాలు వున్నాయి. అందులో జంతువులలో  భాగమైన మానవునికి కొన్ని ధర్మాలు, కుక్కలకు కొన్ని ధర్మాలు వున్నాయి. ఇలా  ప్రతి ఒక్క జంతువుకు ధర్మాలు వున్నాయి. ఏ జంతువైన తన ధర్మానికి బదులు ఇతరుల ధర్మం  ఆచరిస్తే కుక్క - గాడిద కథ లా వుంటుంది. (దాన్నే భగవద్గీతలో పర ధర్మం ఎంత బాగున్నా ఆచరించ వద్దు అని అంటాడు).
           కాబట్టి, గుర్రాన్ని కొనండి. ప్రాక్టీసు చేయండి. స్వారీ వలన మంచి వ్యాయామం. చక్కటి ఆరోగ్యం. గుర్రానికి మేపటానికి ఖర్చు అయినా, అది మన  ఇంట్లో  వేసే పెంటను రైతు అమ్ముకోవచ్చును. టూ వీలర్ వలన పెట్రోలు ఖర్చే కానీ ఆదాయం లేదు పైగా అది వదిలే పొగ వలన అనేక మంది (ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది) జబ్బులు పలు అవుతున్నారు. గుర్రపు సవారీని ఉపయోగించలేని వారు సైకిలు వాడండి. లేదా వీలైతే గుర్రపు బండి వాడండి. ఒకప్పుడు రైతులు గుర్రపు బండిని, ఎద్దుల బండిని ఉపయోగించే వారు. పర్యావరణంలో భాగమైన జీవావరణాన్ని కాపాడే భాగం గా జంతువులను పోషిస్తూ దాని పేడను పొలాలకు వాడుకునే వారు. కానీ ఈనాడు రైతులంత కాలుష్య ప్రేమికులైపోయారు. ట్రాక్టర్లను, రసాయనక ఎరువులను వాడుతున్నారు. వాటివలన వచ్చే కాలుష్యాలను ఆస్వాదిస్తున్నారు. ప్రజల అనారోగ్యాలకు కారకులవుతున్నారు.
        ఆనాడు ఆ త్రేతా యుగానికి  తగ్గట్లుగా  వానర సైన్యం ధర్మ సంస్థాపనలో శ్రీ రాముడి  వెనుక పాల్గొన్నది. 
       తర్వాత ద్వాపర యుగానికి తగినట్లు ధర్మసంస్థాపనలో శ్రీ కృష్ణుడి వెనుక కాకుండా శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా కౌరవుల ప్రక్కన  పాల్గొన్నది. (వివరాలు రాముని కాలంలో ధర్మా,ధర్మాలు, కృష్ణుడి కాలంలో ధర్మా,ధర్మాలు ఏమి అనే బుల్లెటిన్ చూడండి.)        
         కృష్ణావతారం లో పాండవ సైన్యం కౌరవ సేనతో పోరాడి గెలిచింది అని అనుకుంటున్నారా? పొరబాటు. పాండవుల వైపు శ్రీకృష్ణుడు వున్నాడు. శ్రీకృష్ణుని సైన్యం అంతా కౌరవ సైన్యం తో కలిసిపోయి కౌరవ సైన్యాన్ని (అధర్మాన్ని ధర్మం) అంతం చేసింది. ఆ విషయం చాల లోతుగా ఆలోచించాలి. అదే ఆనాటి ధర్మ సంస్థాపన .
         రామావతారం లో రావణాసుర వధ సమీపించే సమయనికీ చనిపోయిన రామదండు అంతా లక్ష్మనునికోసం తెచ్చిన సంజీవిని ద్వారా బ్రతికారు. అలాగే మహాభారతంలో కౌరవ సేనలో కలిసిపోయి శ్రీకృష్ణుని సైన్యం అంతా బ్రతికింది.
           ఆనాడు రాక్షసత్వం కంటికి కనిపించేది. ఈనాడు అది కాలుష్య రూపంలో వుంది. కాలుష్యం పెరిగే కొద్దీ అధర్మం పెరుగుతుంది. కాలుష్యాన్ని తగ్గించడం ప్రారంభిస్తే, ఆర్థిక సంక్షోభం కూడా తగ్గుతుంది. ఆహార సమస్య ఉద్యోగ సమస్య తగ్గుతుంది.చాలామందికి ఇది అర్థం కాదు. సమస్యలు తగ్గించడం ధర్మం సమస్యలు పెంచడం అధర్మం ఆలోచించండి మేధావుల్లర! అలాగే ఈనాడు  ధర్మ సంస్థాపనలో సాయి సైన్యం పాల్గొనాలి.    
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo
-------------------------------------------------------------------------------------------------
           
            ప్రతి ఒక్కటి నార్మల్ గా వుండాలి అని ముందు చెప్పుకున్నాం. ఉదా: చొక్కా సైజు, చెప్పు సైజు, B .P ., SUGAR  యిలా ఎన్నో.... అలాగే మన ఆదాయం , ఖర్చులు, కూడా... నార్మల్ గా వుండాలి. 
           ఒకప్పుడు....ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కరి మీద ఆధారపడి ఉంటుంది ఆదాయం ,ఖర్చులు. కుటుంబంలో ఎంతమంది వున్నా అందులో ఎంతమంది సంపాదనాపరులో, ఎంతమంది సంపాదించ లేని వారో (వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా), అందరికీ సమానం గా కుటుంబ పెద్ద ఒకరు బాలన్సు చేసే వారు.భవిష్యత్తులో కుటుంబం ఎంత పెద్దది అవుతుందో తెలీదు అన్నట్లుగా, క్రింది తరాల వారికోసం కూడా సంపాయించి దాచేవారు. అది ధర్మం. కానీ, మెకాలే విద్యా విదానం లో పడి భారతీయ ఉమ్మడి సంప్రదాయాలను మరచిపోయారు. నేను ఏమి చెప్పుచున్నానో చాలామందికి అర్థం కాదు. 
               ఉమ్మడి కుటుంబాలను చిన్న కుటుంబాలుగా , ఆ చిన్న కుటుంబాలను విడాకుల పేరుతో వ్యక్తి కుటుంబాలుగా తయారు చేసారు రాక్షస మేధావులు. ( వివరాలు విడాకులు ఎవరు కనిపెట్టారు? ఎందుకు? అనే బుల్లెటిన్ లో చూడండి) అలా విడగొట్టడం చేసేపని రాక్షస మేధావులు చేస్స్తున్నారు. అది అధర్మం. కానీ, దాన్ని ఎక్కువ మంది ఆచరిస్తున్నందు  వలన యిప్పుడు అదే ధర్మం అని అనుకుంటే వ్యక్తి కుటుంబాలకు క్రింద తరం తో సంబంధం లేదు కదా! అలాంటప్పుడు ఒక వ్యక్తి తన వరకు ఎంత కావాలో అంత సంపాయించడం ధర్మం. అంతకంటే ఎక్కువ సంపాయించడం అధర్మం. దాని వలనే సమస్యలు. కాబట్టి సాయి సైనికులుగా వుండాలి అని అనుకునే వాళ్ళు అందరూ ఎంతకావాలో అంతకంటే ఎక్కువ సంపాయించిన వారు యికపై సంపాయించడం ఆపండి. ఆపి ఏమి చెయ్యాలి అని అడుగుతారు.
          ఉదా: ఒక వ్యక్తి 1000 నెలలు బ్రతుకుతాడంటే, నెలకు ఎంత ఖర్చు కావాలో అంత x 1000  నెలలు సంపాయిస్తే చాలు. అలాంటి వారంతా  యోగా వైపు మరలండి. Maximum సమయం యోగాలో వుండండి. ఎవరూ దర్శించలేని వాటినంతా దర్శించండి. దర్శించిన దాన్ని పది మందికి చెప్పండి. దిన చర్యలో మార్పు తీసుకు రండి.  కేవలం ఆకలైనప్పుడు ఆహారం మిగిలిన సమయం యోగ, ధ్యానం లో వుండండి. ఇలాంటి వారె మహర్షులు, యోగులు, గంధర్వులు, వగైరా.. వగైరాలు. అవసరానికి మించి వుంటే చేస్తున్న ఉద్యోగానికి విరమణ చెప్పండి. యోగ, ధ్యానం వైపు మారండి సాయి సైనికులారా! మీ స్థానంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది. ఎందుకంటె వ్యక్తి కుటుంబ సమాజంలో మీ భార్య అనే జీవి  కూడా సంపాయిస్తుంది కదా . అలాగే మీ పిల్లలు అనే జీవులకు మీరే అవకాశం యివ్వాలి. 
       అలాగే 1000 నెలలు బ్రతకడానికి ఒక ఇల్లు (గూడు) చాలు. మీకు మరొక ఇల్లు వుంటే అమ్మేయండి. ఎందుకంటె ప్రభుత్వం అన్ని వ్యక్తి కుటుంబ జీవులకు విడివిడిగా ఇళ్ళు కట్టిస్తున్నారు అలాంటప్పుడు మీ యింటికి అద్దెకు ఎవరూ రారు . అలాంటప్పుడు ఆదాయం లేని ఆస్థి కదా! మీ అబ్బాయికి అంటారా! వ్యక్తి కుటుంబ సమాజంలో మీ అబ్బాయికి   ప్రభుత్వం కట్టిస్తుంది. లేదా మీ యింట్లోనే వుంటాడు. ఎందుకంటె, మీలా యోగ ధ్యానంలో వుండే వారంతా ఒక చోట చేరుతారు కదా! అదే ఆశ్రమం. ప్రస్తుతం పార్ట్ టైం గా వున్నా భజన మండళ్ళు, సాయి దేవాలయాలు ఫుల్ టైం ఆశ్రమాలుగా మార్చుకోండి.
         ఎంత  అవసరమో అంత వుండటం వలన మీరు ధర్మాన్ని పాటించినట్లు అవుతుంది. అదే సమయంలో త్వరగా మీరు విరమణ చేసినందువలన మరొకరికి ఉద్యోగ అవకాశం. మీరు ఫుల్ టైం ఆశ్రమవాసిగా యోగ ధ్యానం లో ఉన్నందు వలన స్వంత వాహనాలకు స్వస్తి పలుకుతారు అంటే కాలుష్యాన్ని నిరోధించినట్లే....యిలా ఎన్నో రకాలుగా కాలుష్యాన్ని, పర్యావరణాన్ని(ప్రకృతి)  బాలన్సు చేయవచ్చును. అంటే ధర్మ సంస్థాపనలో మీరు పాల్గొన్నట్లే, ధర్మ సంస్థాపన జరుగుతున్నట్లే.
         యిదంతా సాయి భక్తులే, సాయి సేవకులే  ఎందుకు చేయాలి?  అంటే ధర్మ సంస్థాపనలో మీరంతా భాగస్తులు కావాలి. మీరంతా రామాయణంలోని వానర సైన్యం, కృష్ణావతారం లోని గోపాలురు  కాబట్టి. ధర్మ సంస్థాపనలో పాల్గొన్నవారే సాయి సైనికులు. మిగిలినవారంత సాయి భక్తులు, సాయి సేవకులు. పాండవ పక్షంలో ఉన్నవారంతా శ్రీకృష్ణుని భక్తులు, సేవకులు, శ్రీకృష్ణుని సైన్యం అంటే గోపాలురు. వారంతా దుర్యోధనుని పక్షం లో వున్నారు. ఆ ప్రకారం గ సాయి సైనికులు వేరు. సాయి భక్తులు వేరు. 
      ఒకవేళ మీకు ౧౦౦౦ నేలలుకు కావలసిన ఆదాయం లేకున్నా సాయి సైనికులుగా మరి యోగ ధ్యానం ఆశ్రమజీవితంలో వుంటే ( LOW B P ., LOW SUGAR మాదిరి ) అయిన సరే దాన్ని నార్మల్గా చేయడానికి సాయి వున్నాడు. ఎందుకంటె మీరు ధర్మ సంస్థాపనలో పాల్గొంటున్న సాయి సైనికులు కదా !
వృత్తి ధర్మం దారి తప్పింది 
       కుక్క - గాడిద కథ ను చాల మంది వినే వుంటారు. అది ధర్మం. కుక్క పని (వృత్తి) కుక్క చేయాలి. గాడిద పని (వృత్తి) గాడిద చేయాలి. అదే ధర్మం గాడిద ధర్మం  తప్పింది. యజమాని దగ్గర నడ్డి విరుచుకుంది. విన్నారు కదా! అలాగే మానవుని ధర్మం మాత్రమే మానవుడు చేయాలి. మానవుని ధర్మాలు ఏమిటి? ఎన్ని రకాలు? అవి ఎన్నో? అందులో వృత్తి ధర్మం చెప్పుకుందాం. డాక్టరు తన వృత్తి తప్ప మరొక వృత్తి వైపు కన్నెత్తి చూడకూడదు. ఉపాద్యాయుడు తన వృత్తి తప్ప మరొక వృత్తి వైపు కన్నెత్తి చూడకూడదు. JUST LIKE కుక్క గాడిద కథలో మాదిరి. అక్కడ యజమాని గాడిద నడ్డి విరిచాడు. మానవుల్ని ఎవరు విరుస్తారు అని అందరూ అనుకుంటారు? అందుకే ధర్మాన్ని తప్పుతున్నారు. మన యజమాని భగవంతుడు. 
           మానవుడు అనే  యజమాని పాత్ర వేసి గాడిద నడ్డి విరిచాడు. కానీ, భగవంతుడు అనే యజమాని దయామయుడు కరుణామయుడు. అయన దయను కరుణను అందుకున్నవారంతా తెలిసో తెలియకో తమ వృత్తి తో పటు మరొక వృత్తిని చేపట్టి వుంటే దాన్ని వదిలినట్లైతే వారంతా సాయి  సైనికులే. సాయి భక్తులు సాయి సేవకులు అందరూ ఒకే వృత్తిని అంటి పెట్టుకుని మిగిలిన వృత్తులను ప్రక్కన పెట్టి సాయి సైనికులు గా మారితే అదే ధర్మ సంస్థాపన.
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo
-------------------------------------------------------------------------------------------------

                                              
              వస్తు మార్పిడి వున్నప్పుడు కొందరు రాక్షస మేధావులు  అధర్మం వైపు నడిచారు. దాన్ని బాలన్సు చేయడానికి , అప్పుడు  బ్రహ్మ వరం పొందిన వాడు నాణేలను కనిపెట్టాడు. కొందరు రాక్షస మేధావులు నాణేలతో కూడా అధర్మం వైపు నడిచారు. మళ్ళీ మరొక బ్రహ్మ వరం పొందిన వారు  పేపరు, ప్రింటింగు మిషన్లు కనిపెట్టారు. పేపరు కరెన్సీ కూడా అధర్మం వైపు నడుస్తుంది. త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నిండుకుంటుంది. అదే కరెన్సీ యుద్ధం. 
      సైన్సు ప్రగతి పథంలో పయనించడంలో అధర్మం పెరగడం ప్రారంభం అయ్యింది. అప్పుడు ఎందరో మహర్షులు (అరవిందస్వామి, రమణ మహర్షి లాంటి వారు ఎందరో)  ధర్మ పరాయణుల (గాంధీ లాంటి వారు ఎందరో) ప్రార్థనల మీద ధర్మాన్ని అధర్మాన్ని బాలన్సు చేయడానికి సాయి అవతారం వచ్చింది. 
          రామావతారంలో కృష్ణావతారంలో  ఎన్నో విధాలుగా ఎన్నో విషయాల్లో ధర్మం దారి తప్పింది. అంటే అధర్మం పెరిగింది. అలాగే ప్రస్తుతం కరెన్సీలో మాత్రమే కాదు ఎన్నో విధాలుగా ఎన్నో విషయాల్లో అధర్మం పెరిగింది. కానీ, అన్నిటికీ కరెన్సీయే మూలం 
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo
-------------------------------------------------------------------------------------------------


రామాయణ కాలం 
           రామాయణ కాలంలో అధర్మాన్ని పాటించే వారు ఒకే చోట వున్నారు. అదే లంకా రాజ్యం. అక్కడికి సమీపంలో వున్నా వానర సైన్యానికి పురమాయించాడు శ్రీ రాముడు. వానర సైన్యం అంటే ఏమిటో అనుకుంటారు. వారంతా నరులు కారని, వానరులని అనుకుంటారు.అది సత్యం కాదు. వారంతా కూడా నరులె.... కాకపోతే యోగావిద్యలో ఆరితేరిన నరులు. అరితేరామన్న అహంకారంలో వున్న నరులు. వారికీ తోకలు వున్నట్లు చెబుతారు. అది వానరులకు వుండే తోకలు కావు. నరులకు వుండే తోకలు. కంటికి కనపడని  తోకలు. ( కానీ కనపడుతున్నట్లు కవులు కల్పన చేసారు.)
            సాధారంగా కొందరు ''వీడికి తోక పెరిగిందిరా! '' అని అంటారు. అంటే.... ''అప్పట్నుంచి మన మాట వినటం లేదు '' అని అర్థం. పైగా ''ఏమి చూసుకుని వాడికా ధైర్యం.'' అంటారు. అలా తోక పెరిగిన వారినంతా తన అండర్ లో  కంట్రోల్ చేసుకున్నాడు శ్రీరాముడు. అదే సమయంలో ఆ నరులంతా యోగ విద్యలో ప్రావీణులై అహంకారంతో తోక తిప్పారు. ఎందుకంటె యోగ విద్యలో భగవద్దర్శనం కలిగి ఆ భగవంతుడు తమకు అండగా వుండాడనే అభిప్రాయం వలన. ఆ అభిప్రాయంలోనే వారు అందరు ముందూ తోక విప్పుతారు. కానీ శ్రీరామున్ని చూడగానే భగవంతుని చెంత వున్నామనే తోక ముడుస్తారు. అలాంటి యోగవిద్యలో ప్రావీణ్యం వున్నా వానర సైన్యం తో అధర్మాన్ని అణిచి ధర్మ సంస్థాపన చేసాడు శ్రీరాముడు. ధర్మ సంస్థాపన అంటే సమూలంగా కాదు. అలా ఎప్పుడూ, ఏ యుగంలోనూ, ఏ అవతారమూ చేయదు. ఎందుకంటె, త్రాసులో రెండు వైపులా ధర్మం, అధర్మంలను  ఉంచితే రెండూ సమానంగా వుండాలి. అదే ధర్మ సంస్థాపన .........
           అంతే గానీ 100 % ధర్మం వుంది. 0 % అధర్మం వుంది అంటే అది మళ్లీ సమస్యే .........నేను చెప్పునది చాలామందికి అర్థం కాదు. ( నేను చెప్పునది గ్రహించువాడు ఒక్కడునూ లేదు అని బాబా అన్నట్లు..
       పగలు (వెలుతురు) విలువ తెలియాలి అంటే రాత్రి (చీకటి) వుండాలి. 
      రాత్రి (చీకటి) విలువ తెలియాలి అంటే పగలు (వెలుతురు) వుండాలి. అలాగే ...
      ధర్మం (ప్రకృతి)  విలువ తెలియాలంటే అధర్మం (వికృతి) వుండాలి. త్రాసులో రెండూ సమానంగా  ఉండడమే (Balance of Dharmam) ధర్మ సంస్థాపన.. లేదా ధర్మ సంరక్షణ .....
మహాభారత కాలం
           తర్వాత మహాభారత కాలంలో
         మేనక విశ్వామిత్రులకు  పుట్టిన శకుంతల ద్వారా భరతుడు వలన భారత వంశం వచ్చింది. 
          భరతునుని నుండి 4 జనరేషన్ లో హస్తి అనే రాజు పుట్టాడు.
          హస్తి నుండి 5 వ జనరేషన్ లో కురు అనే రాజు పుట్టాడు. హస్తి యొక్క మనవళ్ళు అంటే 3 వ జనరేషన్ లో 124 మంది పుత్రులు.
          భరతుని 2 , 3 , 4 , జనరేషన్ లో కుమార్తెలు, కుమారులు,
          హస్తి యొక్క 2 , 3 ,4 , జనరేశాన్లో కుమార్తెలు, కుమారులు  అక్కడక్కడ ప్రపంచమంతా విస్తరించి వున్నారు. ( మనం యిప్పుడు అనుకునే విదేశీయులు అందరూ భారత వంశీయులే. నేను చెప్పునది చాలామందికి అర్థం కాదు. శ్రీమతి సోనియా గాంధీ కూడా భారత వంశీయురాలే. అన్ని మతాల వారు భారత వంశీయులే  )
           కురు యొక్క మనవళ్ళు 124 మంది లో కొందరి వలన అధర్మం పెరగడం  ప్రారంభించింది. కానీ, కురు యొక్క 11 వ జనరేషన్ ద్రుత రాష్ట్ర కుమారులు 100 మంది వలన మరింత ముదిరింది. (ఆ 100 మంది దుర్యోధనాదులకు వివాహ సంబంధాలు కూడా భరత వంశం అయిన 2 , 3 , 4 జనరేషన్ లోను , హస్తి వంశం అయిన 2 , 3 , 4 , 5 జనరేషన్ లోను చేసుకున్నారు ) అంటే వారికీ తెలిసో తెలియకో తమ దాయాదుల తోనే యుద్ధాలు. అయితే ఇవన్నీ భరత యుద్ధంలో కనపడదు. లేటెస్ట్ జనరేషన్ ,లేటెస్ట్ దాయాదులు పాండవులు, దుర్యోధనాదులు మధ్య కనపడుతుంది. అంటే ఆనాడు మహా భారత యుద్ధ కాలం లో అధర్మం భారత దేశం లోనే  దుర్యోధనాదుల వలన పెరుగుతూ వుంది. మిగిలిన ప్రపంచంలో వున్న భరత వంశం అయిన 2 , 3 , 4 జనరేషన్ లో లేదు. ( ఈ విషయం యుద్ధానంతరం భీష్ముడు వద్దకు పాండవులు వచ్చినప్పుడు ప్రపంచంలో మిగిలిన రాజుల, దేశాలు వారి వారి బలాబలాలు గురించి చెప్తాడు. దీన్ని బట్టి ఏమి తెలుస్తుంది అంటే గ్రీకులు, రోములు, లాటినులు  అనే వారంతా కూడా భారత వంశీయులే . ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక  శ్రీమతి సోనియాగాంధీని భారతీయురాలు  కాదు అని అంటున్నారు. అసలు ప్రపంచంలో వున్న వారంతా  భారతీయులే.) అందుకే ధర్మ సంస్థాపన  భారతదేశం వరకే అన్నట్లు జరిగింది. మరొక్క విషయం 100 మంది దుర్యోధనాదులు ఏకచత్రాధిపత్యం కోసం నడిపిన యుద్ధాలలో ఎంతో రక్తపాతం పారింది. ఆ రక్తం వలెనే కాలుష్యం పెరిగింది. అది ఇంకా పెరుగుతూనే వుంది. అప్పుడు ధర్మ సంస్థాపన జరిగింది.  
           అలాగే, అశోకుడు ఏకచత్రాధిపత్యం కోసం అనేక యుద్ధాలు చేసాడు. అనేక రక్తపు మడుగులుకు కారణం అయ్యాడు. కాలుష్యం పెరిగింది. అప్పుడు ధర్మ సంస్థాపన కోసం , ఆ కాలుష్యాన్ని balance  చేయడానికి చెట్లు నాటాడు. ( ఈ విషయం చాలామందికి తెలీక, ఏదో అశోకుడు చెట్లు నాటించెను అని స్కూలు పాఠాల్లో  మాత్రం చెప్తారు. అయితే అప్పుడు ధర్మ సంస్థాపనకు అవతారం వచ్చిందా అని కూడా అడిగే వారుంటారు. అప్పుడే రావలసిన పని లేదు. గతంలో వచ్చిన అవతారాల్లో చెప్పిన వాక్యాలను గ్రహించి వుంటాడు అశోకుడు లేదా గ్రహించిన వారు వివరిస్తే పరివర్తన కలిగి వుంటాడు. గ్రహించి బాలన్సు చేయటానికి భగవంతుడు ఒకటి రెండు చాన్సులు యిస్తాడు.  అప్పటికీ కుదరక పోతే అవతారం వస్తుంది. అలాగే సైన్సు అంటూ పరిశోధకులు వచ్చాక కొన్ని చాన్సులు యిచ్చాడు భగవంతుడు. కానీ పరిశోధకులు, కాలుష్య పోషకులు కారకుల్లో పరివర్తన రాలేదు. అందుకే సాయి అవతారం వచ్చింది.
           ఆనాడు కత్తులతో యుద్ధాలు. రక్తం ద్వారా కాలుష్యాలు పెరిగాయి. ( మాంసాహారం తినే వారి వలన కూడా రక్త కాలుష్యాలు జరుగుతున్నాయి. అందుకే వారిని గతంలో  రాక్షసులు అనే వారు. 
            ( 24 x 7 మాంసాహారం తినని వారు దేవతలు, 
                     24 x 2 లేదా 3 మాంసాహారం తినే వారు మానవులు, 
                     24 x 7  మాంసాహారం తినే వారు రాక్షసులు. 
                     ఏ జాతి వారు మీరు ఆలోచించండి? )
             తర్వాత, తుపాకులతో, బాంబులతో యుద్ధాలు. ఇందులో రక్తం ద్వారా కాలుష్యం, + రసాయనాల ద్వారా కాలుష్యం. 
              కానీ, ప్రస్తుతం కరెన్సిలతో యుద్ధాలు. ఇందులో రక్తం ద్వారా కాలుష్యాలు తక్కువ. రసాయనాలతో కాలుష్యాలు తక్కువే. కానీ సైన్సు ప్రగతి అనుకుంటూ పారిశ్రామికంగా (అందులో ఉప భాగాలుగా వాహనాలు, ప్లాస్టిక్, సిమెంటు, రసాయనిక ఎరువులు, విద్యుత్తు, యిలా ఎన్నో వున్నాయి ) ద్వారా కాలుష్యాలు వస్తున్నాయి.  ఈ కరెన్సీ యుద్ధం తద్వారా కాలుష్యం ప్రపంచ వ్యాప్తం గా వుంది  అందుకే ఈ నాడు ధర్మ సంస్థాపనకు వచ్చిన సాయికి ప్రపంచమంతా సాయి భక్తులు , సేవకులు గా వున్నారు. వీరంతా సాయి ధర్మ సంస్థాపనలో భాగంగా సాయి సైనికులుగా మారాల్సిన సమయం వచ్చింది.
            షిర్డీ సాయి శ్యామా కోసం తనువు చాలించాడు. పర్తి సాయి శిష్ట రక్షణలో  భాగంగా శిష్టుల అనారోగ్యం తను తీసుకుని వారిని రక్షిస్తూ  వున్నారు. అందరూ అనుకోవచ్చు...... సాయి తనువు చాలించాడు కదా! యింక ఎక్కడ శిష్ట రక్షణ అని...... కానీ, భవిష్యత్తులో అనుభవించే భక్తులకు, సేవకులకు తెలుస్తుంది . ... సాయి శిష్ట రక్షణ  చేస్తున్నాడా? లేదా? అని.....
------------------------------------------------------------------------------
ప్రకృతే పర్యావరణం  వికృతే కాలుష్యం 
ప్రకృతి ఆకారం దేవతాకారం కృతి ఆకారం మానవాకారం వికృతి ఆకారం రాక్షసాకారం
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo
-------------------------------------------------------------------------------------------------

సాయికి మాత్రమే సేవ చేసే వారు... సాయి సేవకులు
సర్వానికి సేవ చేసే వారు... సాయి సైన్యం
           దుష్ట శిక్షణ కార్యక్రమం అంటే ఏమిటి? ఎలా వుంటుంది? అని చాల మందికి అర్థం కాదు.
           ప్రస్తుతం యుద్ధం కరెన్సిలతో కాబట్టి కరెన్సీయే కరవాలం. పర్తి బాబా గతంలో చాలా సార్లు చెప్పారు. ఏమంటే... ఈ అవతారంలో ధర్మ సంస్థాపనకు  యుద్ధాలు జరగవు. కేవలం మంచి మాటలతో దుష్టులకు శిక్షణ ఇస్తాము అనేవారు. శిష్టులుగా  మారుస్తాం అని అనేవారు. గుర్తుకు తెచ్చుకోండి .
       ధర్మ సంస్థాపనలో భాగంగా పర్తి బాబా వారి ఉపన్యాసాలలో అప్పుడప్పుడు చెబుతూనే వున్నారు. కానీ, దాన్ని అర్థం చేసుకోవడమే చాలామందికి  అర్థం కాలేదు. షిర్డీ బాబా అవతారంలో కూడా బాబా వాక్యాలను అర్థం చేసుకున్నవారు కూడా తక్కువే.
          పర్తి బాబా కొన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించారు. కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉదా : ప్రశాంతి నిలయంలో పట్టణ వాటిక లో రాత్రి ఎన్నిగంటలకు లైట్లు అర్పుతారు. దాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి. మనం కూడా మనయింట్లో ఆ సమయానికి లైట్లు ఆర్పడం నేర్చుకోవాలి. ఎలా బాబా  నేర్పిన ప్రాక్టికల్స్ ను ఆచరణలో పెట్టినవారే సాయి సైన్యం. మిగిలిన వారంతా కేవలం సాయి సేవకులే. అర్థం చేసుకోవడం చాల కష్టం. అలాగే ముఖం కడుక్కోవడం ఎలాగో కూడా ప్రాక్టికల్ గా చూపించారు. దాన్ని కూడా ఆచరణలో పెట్టిన వారు సాయి సైన్యమే. యిలా ఎన్నో వున్నాయి. ఒక్కొక్కటి గుర్తుకు తెచ్చుకోండి. 
        అలాగే పర్తి బాబా చెప్పేవారు.... మన చెప్పులు, మన చొక్కా కరక్టు సైజు లో వుండాలని. చెప్పు సైజు పెద్దదైతే పడిపోతారు. చిన్నదైతే కరుస్తుంది. చొక్కా పెద్దదైతే అసహ్యం గా వుంటుంది. చిన్నదైతే చిరిగి పోతుంది. అలాగే  ధనం నిల్వ కూడా అని అర్థం చేసుకోవాలి. మరి ఈ వాక్యాలను అర్థం చేసుకొని ఆచరణ లో పెట్టిన వారు సాయి సైనికులే. 
       అంటే చెప్పు, చొక్కా, B .P ., SUGAR , GAS , ISNOFILEYA  యిలా ప్రతి ఒక్కటి నార్మల్ గా వుండాలి. ఈ వాక్యాలను అర్థం చేసుకుంటే , అందులో వున్నది ఏమిటంటే ....అవసరానికి మించి వుంటే తప్పదు ముప్పు అని. అవసరానికి తక్కువు గా వున్నా సమస్యే అనుకోండి. ప్రస్తుతం తక్కువుగా వున్నది పెంచుకుందాం. ఎక్కువుగా వున్నది తగ్గించుకుందాం. దాన్నే balance  అంటారు. నార్మల్ గా తెచ్చుకోవడం. అదే ధర్మ సంరక్షణ.
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo
-------------------------------------------------------------------------------------------------






               నీటిలో అధర్మం ఎలా పెరిగింది 
          స్వచ్చమైన నీరు గతంలో బావిలోను, నుయ్యిలోను, మంచినీటి చెరువులోను, లభించేవి. అయితే ఆ నీటిలో  మనకు తెలీని కలుషితాలు వున్నాయి. వాటి వలన జబ్బులు వస్తాయి అని చెప్పి, మనకు తెలిసేలాగా అందులో స్లో పాయిజన్  కలుపుకుకుని త్రాగుతున్నము. ఎలాగైనా జబ్బు రావలసిందే. కానీ నాచురల్ గా, ప్రకృతిపరంగా తెలీని కలుషితాల వలన జబ్బు వస్తే అది ధర్మం. మనకు తెలిసేలా స్లో పాయిజన్ కలుపుకుని జబ్బు తెచ్చుకోవడం అధర్మం.  అంతే కాదు ఈ అధర్మంతో భూత దయ అనేది కూడా చచ్చిపోతుంది.నేను చెప్పేది చాలామందికి అర్థం కాదు.
         ఒక వేళ బావి నీళ్ళు, చెరువు నీళ్ళు ఉప్పగా వుంటే, వాటిని ప్రత్యేకగం గా స్నానాలకు వాడుకునే వారు. ఎందుకంటె ఉప్పునీళ్ళ స్నానం సముద్ర స్నానం తో సమానమని. అది ఆరోగ్యం అని అందులో స్విమ్మింగ్ కూడా చేసే వారు. అందరూ ఆరోగ్యంగా వుండేవారు. (వివరాలకు పూర్వం నీటిని ఉపయోగించే పద్ధతి అనే బుల్లెటిన్ చూడండి.)
         అయితే సైన్సు, ప్రగతి అంటూ మెడికల్ కాలేజీల సంఖ్య పెంచి డాక్టర్ల సంఖ్య పెంచి వారిని పోషించడానికి బలవంతంగా ప్రజలకు అనారోగ్యాలు రావడానికి పంచభూతాలను నాశనం చేస్తూ ప్రజలకు అనారోగ్యాలను తెప్పిస్తున్నారు రాక్షస మేధావులు. (వివరాలకు కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి బుల్లెటిన్ చూడండి.) అది అధర్మం.  అధర్మం పెరగవచ్చు కానీ, ధర్మంతో బ్యాలన్సుగా పెరగాలి. అంతే కానీ, ధర్మాని అణగద్రొక్కి అధర్మం పెరుగుతూ వుంటే, అప్పుడు అవతారం రావాలి. అందుకే సాయి అవతారం వచ్చింది. ధర్మ సంస్థాపనలో పాల్గొనే సాయి సైన్యం నీటి కాలుష్యం బ్యాలన్సు  చేయడానికి ముందు ఎన్ని రకాలుగా నీటిలో అధర్మం పెరుగుతుందో కొంతైనా తెలుసుకోవాలి. అప్పుడు బ్యాలన్సు చేయడానికి చక్కగా వుంటుంది.
          చీరాల - పేరాల ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చుకోండి. క్లుప్తంగా చీరాల గ్రామాన్ని ఆనాటి బ్రిటీషు వారు ఉన్నపళంగా మునిసిపాలిటీగా అవసరం లేకపోయినా చేసారు. అప్పుడు ధర్మ సంస్థాపన కోసం వచ్చిన మహాత్మా గాంధీ  ధర్మసంస్థాపనలో భాగమే పేరాల. (వివరాలకు మహాత్మా గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవండి.) 
            ఆ ప్రకారంగా అవసరం లేకపోయినా గ్రామాలను మునిసిపాలిటీ లుగా , మునిసిపాలిటీ లను కార్పోరేషన్ లుగా మార్చి, నీటి కరువును సృష్టిస్తున్నారు. ఎందుకంటె, గ్రామంలో వున్న చెరువులను, బావులను మాయం చేస్తున్నారు. (కొళాయిలు వేస్తున్నారు. చెరువులు, బావులు ప్రకృతి అంటే కొళాయిలు వికృతి.)
           చెరువులు బావులు ఎందుకు పూడ్చేస్తారు? ఎవరు పూడిపిస్తారు? అంటే ఎవరి జాతక చక్రంలో అయితే చెరువులు బావులు త్రవ్విస్తారు అని వుంటే వారు త్రవ్విస్తారు. అంటే ఎవరి జాతక చక్రంలో అయితే చెరువులు బావులు పూడిపిస్తారు  అని వుంటే వారు పూడిపిస్తారు. (పూర్తి వివరాలకు రచయిత బ్లాగర్ ను కలవండి. లేదా సమీప జ్యోతిష్కుని కలవండి.) అంటే త్రవ్వించేవారు దేవతలైతే, పూడ్పించేవారు రాక్షసులు. ఎందుకంటె బావుల్లో నీళ్ళు రోజూ తోడే దాని వలన ప్రజలకు మంచి వ్యాయాయం  జరిగి  ఆరోగ్యంగా   వుండేవారు. కొళాయిల వలన వ్యాయాయం లేక అనారోగ్యం పాలు అవుతున్నారు. అందులో త్రాగు నీటిలో ఎక్కడో డ్యాముల్లో నిల్వ నుండి తీసు వచ్చి. వాటర్ ట్యాంకుల్లో నిల్వ చేసి ఆ నీటిని శుభ్ర పరచాలని రసాయనిక మందులు వాసి స్లో పాయిజన్ ను ఎక్కిస్తున్నారు ప్రజలకు. కంటికి కనపడని నీటిలో వున్న జీవాలకు ఒక్క రోజుకే హాని చేసే రసాయనిక మందు ప్రజలకు మెల్ల మెల్లగా నైన హాని చేయదా?ఇది చాల మందికి అర్థం కాదు. (ఇదంతా ఎందుకు? కాబోయే డాక్టర్లను బ్రతికించ డానికి. వారిని అంటే డాక్టర్లను బ్రతించ డానికే B . T . వంకాయను, B T  ప్రత్తిని కనిపెట్టారు. ఎందుకంటె కాలుష్యాన్ని పెంచడానికే. చాల మందికి అర్థం కాదు.) ఆ ప్రకారంగా చెరువులను బావులను మూలాన పెట్టి కొళాయి సామ్రాజ్యాన్ని ప్రారంభ చేసారు.
           అయితే కొందరు అనుకోవచ్చు.  స్వచ్చమయిన నీరు అని చెప్పే చెరువులు, బావులు నుయ్యి లో నీరు త్రాగితే ఎవరికైన అనారోగ్యం పాలైతే .....అవును ఆరోగ్యం చెడిపోవాలి అదే ధర్మం. అప్పుడు ఆరోగ్యం దెబ్బ తిన్న వారు డాక్టర్లను ఉపయోగించుకోవాలి. అంతే కానీ, విద్యనే వ్యాపారంగా మర్చి అందులో డాక్టర్లను ఎక్కువ గా తయారు చేసి వారిని పోషించడానికి ప్రజలకు అనారోగ్యాలు ఎలా వస్తాయా? అని ప్లాను వెయ్యడం అధర్మం. అయితే అనారోగ్యం ఎవరికి వస్తుంది? సంపూర్ణ ఆహరం తినని వారికి వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారికి వస్తుంది. అందరికీ రాదు. సంపూర్ణ ఆహరం అంటే తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు వగరు, ఈ ఆరు సమానంగా వుండాలి. అదే ధర్మం. ఆ ధర్మం తేడా వస్తే అధర్మం. అప్పుడే జబ్బు. ఉప్పు ఎక్కువ తింటే ఒక రకం జబ్బు. తీపు ఎక్కువ తింటే ఓకే రకం జబ్బు. ఇలా ఆరు రకాల శారీరక వ్యవస్థ మండలాలకు (Systems in Human Being ) ఆరు రకాల జబ్బులు. ఆ ఆరు రుచుల సమానమయినప్పుడే ఆరు అరిషడ్వర్గాలను నియంత్రించగలం. ఆ ఆరు రుచులే ఆరు రకాల శారీరక వ్యవస్థ మండలాలను  నియంత్రిస్తుంది.
         ప్రస్తుతం నీటి కాలుష్యం లో ఎన్నో రకాలు. అందులో ఒకటి మునిసిపాలిటీలు. పంచాయతీలను ఎందుకు  మునిసిపాలిటీలుగా చేస్తున్నారు. అంటే బ్రహ్మ కనిపెట్టిన సింహాన్ని బోనులో పెట్టినట్లు, సైంటిస్టు కనిపెట్టిన శుద్ధి చేసే మిషన్లను బోనులో పెట్టకుండా వాటిని ఉపయోగించడానికి పంచాయతీలను మునిసిపాలిటీలుగా చేస్తున్నారు.       
        మనం ఉపయోగించిన నీళ్ళను పంచాయతీలలో నిరుపయోగం గా భూమిలోనికి వదిలేస్తున్నామని, మునిసిపాలిటీలుగా చేసి సిమెంటు రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టి దాని ద్వారా వచ్చే మురికినీరుని శుద్ది చేసి మళ్లీ మనకు కొళాయిల ద్వారా మంచినీరు అని పంపిస్తున్నారు. అది పూర్తిగా  శుద్ది అయిందో లేదో అని అనుమానం తో మళ్ళీ దానికి స్లో పాయిజన్ లాంటి  బ్లీచింగ్ పొడిని వేసి మనకు జబ్బులు రావాలని చేస్తున్నారు. ఇది అధర్మం. మురికి నీరు భూమిలోనికే వెళ్ళాలి అప్పుడే భూమిలో నీటి శాతం తగ్గకుండా వుంటుంది. భూమినుండి మనం నీరు తోడుకోవాలి. మనం వాడిన నీళ్ళు తిరిగి భూమికి యివ్వాలి. ఈ చక్రం ఇలాగే తిరగాలి. అదే ధర్మం. కాబట్టి సాయి సైనికులు ఎలా స్పందిస్తారో ఆలోచించుకోండి. 
          సాయి సైనికులు భూమినుండి వచ్చిన నీళ్ళను భూమికి పంపించి ధర్మాన్ని కాపాడుతారా? అధర్మాన్ని ప్రోత్సహిస్తారా? ఆలోచించుకోండి మేధావుల్లారా!




                నిప్పులో ఎలా అధర్మం పెరిగింది. 
                 ఒక వస్తువు కానీ, ఒక జంతువు కానీ, ఒక మనిషి కానీ నిప్పులో పడితే నల్లగా మాడి బూదిడైపోతుంది. ఆ ప్రకారం గా నిప్పుకు సమానమైనదిగా ప్రస్తుతం విద్యుచ్చక్తి. అందుకే శవాలను కరెంటులో కాలుస్తున్నారు. ఇప్పుడు మనకు ఎంత కరెంటు కావాలి? అనేదే ప్రశ్న. ప్రజలు ఉపయోగిస్తున్నారు అని కరెంటును తయరుచేస్తున్నారా? లేక కరెంటును తయారు చేసి ఇస్తున్నారని ప్రజలు ఉప్పయోగిస్తున్నారా? ఆలోచించండి. మేధావుల్లారా! ముఖ్యం గా యువత.
            పూర్వం పగలు సూర్య కాంతిని వాడుకునేవాడు మానవుడు. చీకటిపడితే చంద్ర కాంతిని వాడుకునేవాడు. అయితే, చంద్రుని వలన కొద్ది రోజులు చీకటి రాత్రుళ్ళు  వస్తున్నాయి. అప్పుడు అనేక జంతువులను భయపెట్టడానికి రాత్రిళ్ళు నిప్పును కనిపెట్టాడు.  ఆ వెలుగులో తనను తాను కాపాడుకున్నాడు.  ఆ వెలుగులోనే పగలు మిగిలిన పనులు చేసుకునే వాడు.  అయితే ఆ నిప్పును ఎంత కావాలో అంతే వెలిగించుకుని వాడుకునే వాడు. అంతే కానీ , అవసరానికి  మించి వేసుకుంటే పెద్ద గాలి వీచి మంటలు లేస్తే ప్రమాదం కదా! తర్వాత కొంత కాలానికి నిప్పు కుదరదని నిప్పు ద్వారా మంట , మంట ద్వారా దీపం అనేది కనిపెట్టుకున్నాడు. దీపం కూడా అవసరానికి ఎంతో అంతే వాడుకునే వాడు. అయితే యిక్కడ తమాషా.. ఏమంటే , సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు చిన్న నిప్ప్పు వుండేది ఎందుకు? వంటకు . చీకటి పడ్డాక మంట వుండేది ఎందుకు? ఇతర జంతువుల నుండి రక్షణ కొరకు. దీపం వచ్చాక మంటకు బదులు గా చీకటి పడ్డాక ఉపయోగించే వారు. అయితే నార్మల్ గా వుండేది. ఎలా? ఒక దినంలో 50 % మాత్రమే (చీకటి పడ్డాక) వాడుకునే వారు. దాన్నే నార్మల్ గా  చెప్పొచ్చు. 
          అయితే సైన్సు ప్రగతి పథం అంటూ విద్యుచ్చక్తి వచ్చింది. మరి మనం ప్రస్తుతం ఆ కరెంటును నార్మల్ గా వాడుకుంటున్నామా ? లేదా? ఆలోచించండి మేధావుల్లార! అవసరానికి మించి ఉపయోగిస్తున్నాము బాగా ఆలోచించండి. మరి అధర్మం పెరిగినట్లే కదా! పైగా తయారీదారులు విద్యుచ్చక్తి ని సేవా రంగం నుండి వ్యాపార రంగం క్రింద మార్చుకోవడం వలన అవసరానికి మించి తయారు చేసి గోడవున్లలో దాచినట్లు కరెంటునూ దాచటానికి రెడీ అవుతున్నారు. అలా చేసే ఈనాడు జపాన్లో సమస్య. 
నిప్పులో ధర్మ సంరక్షణ
            యిప్పుడు సాయి సైన్యం ఏమి చేస్తే నిప్పులో ధర్మ సంరక్షణ జరుగుతుంది. అంటే ముందు గా కరెంటు ఎలా తయారు అవుతుంది తెలుసుకోవాలి. 1 . నీటి ద్వారా నిప్పు (జలవిద్యుత్తు ) 2 . గాలి ద్వారా నిప్పు ( పవన విద్యుత్తు) 3 . ఆకాశం ద్వారా నిప్పు (సోలార్ విద్యుత్తు) 4 . భూమి ద్వారా (గ్యాస్, కిరోసిన్ వైగరాలు) ఈ నాలుగింటి ద్వారానే విద్యుత్తు సంపాయించాలి. అదే ధర్మం. ఇది సత్యం యిదే సత్యం. ఎందుకు? అనే వివరాలులో  http://www.sathyaanveshana.blogspot.com   చూడండి. కానీ, అణు విద్యుత్తు అధర్మం. ఎందుకంటె....నాలుగు పంచ భూతల నుండి ఐదవ పంచ భూతాన్ని పొందడంలో  ధర్మం వుంది. దాన్ని ప్రయోగం చేసారు మానవులు సైన్సు అంటూ. తప్పులేదు. కానీ, పంచభూతాల ద్వారా కాకుండా అణువులతో  ప్రోయోగించి నిప్పును పొందారు. యిది అధర్మం. అందుకే జపాన్లో భూకంపం. కాబట్టి పూర్తిగా అణు విద్యుత్తును మానేయాలి అదే ధర్మం. 
         తర్వాత 24 గంటల్లో ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి. అదే ధర్మం. ఎక్కువ వాడుకుంటే అధర్మం.
        ఉదా: నార్మల్ అంటే 50 % కదా! అంతే వాడుకోవాలి. దానికి ఎక్కువ వాడిన , తక్కువ వాడిన సమస్యే.... కాబట్టి సాయి సైన్యం అనే వారంతా 50 % వాడుతూ వుంటారు. (పూర్తి వివరాలు కరెంటును ఎంత వాడుకోవాలి. చూడండి.) ఉదా: ప్రశాంతి నిలయం లో పట్టణ వాటికలో ఎన్ని గంటలకు  లైట్లు అర్పుతారు. దాన్ని చూసి భక్తులు ఏమి నేర్చుకోవాలి. వారి వారి ఇళ్ళల్లో కూడా అన్ని గంటలకే ఆర్పేసి పడుకోవాలి. ప్రశాంతి నిలయంలో మాదిరి ఉదయమే 3 గంటలకు లేచి స్నానం సుప్రభాతం, నగర సంకీర్తన లో పాల్గొంటే ఎలా వుంటుంది. ప్రశాంతి నిలయంలో మాత్రం ప్రతిరోజు నగర సంకీర్తనలో పాల్గొని మన ఊరులో మాత్రం నెలకు ఒక రోజు నగర సంకీర్తన ఎందుకు చేస్తున్నారు? మొత్తం ప్రపంచాన్నే ప్రశాంతి నిలయంగ మార్చినప్పుడే సాయి సైన్యం ధర్మ సంస్థాపనలో పాల్గొన్నట్లు. అంటే ఒక వైపు ధర్మ సంస్థాపన మరో వైపు ప్రపంచానికి ప్రశాంతిని అందించినట్లు లెక్క. అప్పుడు ప్రపంచమంతా మీలో వున్న ప్రేమను పంచినట్లు. అదే సత్యం.   అలా చేసే వారే సాయి సైన్యం. మిగిలిన వారంతా కేవలం సాయి భక్తులు , సేవకులు. ధర్మ సంస్థాపనకు వచ్చిన సాయి ప్రతి ఒక్కటి చేసి చూపించాడు కానీ అర్థం చేసుకోలేక పోతున్నారు.
             తర్వాత, వాషింగ్ మిషన్, మిక్సీ, ఐరన్ బాక్సు, లాంటి గృహోపకరణలను  వీలయినంత తక్కువ వాడాలి. అంటే..... ఒకావిడ  నాతో యిలా అన్నది. " ఏమండీ! మా యింట్లో ౩ వాటర్ ఫిల్టర్లు వున్నయి కొత్తవి ఎవరికైన కావాలంటే చెప్పండి. తక్కువ ధరకు యిచ్చేస్తాము". "అన్ని ఎక్కడివి? " అని నేను అడిగాను. "ప్రజంటేషన్ లు వచ్చాయి. అవి రక ముందే మనం ఒక్కటి కొనుక్కునం. అది యింట్లో వాడుకున్తున్నాం." అన్నది. దీన్ని బట్టి ఏమి అర్థం అయ్యింది. తయారీదారులు ఉత్పత్తి చేస్తున్నారని మనం కొంటున్నామా! లేక మనం కొంటున్నామని తయారు చేస్తున్నారా! ఆలోచించండి. కాబట్టి సాయి సైనికులు అనేవారు ప్రజంటేషన్ లు తీసుకోరు ఎవ్వరికీ, ఏమీ యివ్వరు. అలాగే వారి యింట్లో ఎక్సస్ గ (అధికంగా) వున్నది వెంటనే లేని వారికి ఉచితంగ యిస్తారు.  ఉచితం అంటే ఏదో సిస్టం పెట్టుకోవాలి కదా! ప్రస్తుతం నారాయణ సేవ మాదిరే. అప్పుడప్పుడు ఎక్సస్ గ వున్న బట్టలను పంపిణీ లాగే, సాయి సైనికులంత అపాత్ర దానం కాకుండా  దానం చేస్తారు. ఆ పైన ఎవ్వరికీ బహుమతులు యివ్వరు , తీసుకోరు. దీని వలన కూడా కరంటు అదా అవుతుంది. పూర్తి వివరాలు రెగ్యులర్ గా చదువుతూ వుండండి. ఎవరూ కొనటం లేదని తయారీ దారులు మెల్లగా తగ్గిస్తారు. 2 షిప్ట్లువుంటే 1 షిప్తుకు మారుతారు. 1 షిప్టు వుంటే మరొక తయారీ దరుతో విలీనం అవుతారు. ఆ ప్రకారంగా అదా అవుతుంది. అప్పుడు ప్రపంచంలో అణు విద్యుత్తు తయారీ అవసరం రాదు.( అది బ్రహ్మ సృష్టిలో సింహం మాదిరి. అణు విద్యుత్తు తయారీని బోనులో పెట్టాలి లేదంటే అపాయం).ఇలాంటివి ఎన్నో వున్నాయి. ప్రస్తుతానికి ప్రారంభంలో సాయిసైనికులు ఈ ప్రకారంగా ధర్మసంస్థాపనలో పాల్గొంటారు. పాల్గొన్నవారంతా  సాయి సైనికులే.


             ఆకాశం అనే పంచ భూతం సూర్య, చంద్రాది గ్రహలతోను నక్షత్రాలు, మేగాలతోనూ కలిపిన సమ్మేళనం. సమ్మేళనాన్ని ఎలా వాడుకోవాలి. దాన్ని కూడా నార్మల్ గ వాడుకోవాలి. అవసరానికి మించి వాడుకోవాలనే ఉద్దేశ్యంతో కావచ్చును లేదా మానవ తప్పిదం కావచ్చును, అవసరానికి మించి సూర్య ప్రతాపం వుంది. ఎందుకంటె ఓజోన్  పొర దెబ్బతిన్నది అంటారు. 
ఓజోన్  పొర
        ఓజోన్  పొర ఎందుకు దెబ్బ తిన్నది. ఎలా దెబ్బ తిన్నది? అంటే  మొదట ఆ పొర ఎలా తయారు వుతున్నది తెలుసుకోవాలి. భూమి నుండి ఆక్సిజన్ పైకి వెళ్ళాలి. ఆ ఆక్సిజన్ తో తయారు కావలి. అయితే భూమి మీద చెట్లు వదిలే ఆక్సిజన్ జంతువులు (జంతువులలో భాగమైన మానవులు) పీల్చుకొని అవి వదిలే Co2 ను చెట్లు పీల్చుకుంటాయి. యిది అందరికీ తెలుసు. అయితే ఈ ప్రక్రియలో ఎక్సస్ గ (అధికంగా) వున్నది ఆకాశం వైపు వెళ్ళుతుంది. అది ఆక్సిజన్ కానీ లేదా Co2 కానీ ఏదైనా సరే. 
          ఈ ప్రక్రియలో ఆక్సిజనే గెలవాలి. అది ధర్మం. ఆ గెలిచినా ఆక్సిజన్ ఆకాశం వైపు వెళ్ళాలి అక్కడ పక్షులకు బ్రతికించాలి. ఆ తర్వాత మిగిలినదంతా పైకి వెళ్లి ఓజోన్ పోరా గ తాయారు కావాలి. అది ధర్మం.
           అయితే ఈ ప్రక్రియలో ఆక్సిజన్ ఓడిపోయే పరిస్థితి వస్తే దాన్ని గెలిపించడానికే యజ్ఞాలు చేసి అందులో నెయ్యి వేసేవారు. ఆ నెయ్యి వలన ఆక్సిజన్ తయారు అయ్యి ఆకాశం వైపు వెళ్ళేది.  అయితే యజ్ఞాలు ప్రస్తుతం చేయరని తెలిసే సాయిబాబా ధుని లాంటిది ఏర్పాటు చేసి నిరంతరం అందులో నెయ్యిని వేయమన్నాడు.
             భూమి మీద జంతువులు  వదిలే Co2  చెట్లు వదిలే ఆక్సిజన్ మధ్య జరిగేది ప్రక్రియ ఒకప్పుడు. సైన్సు పెరిగిన తర్వాత, జంతువుల్లాగా యంత్రాలు వదులుతున్నాయి. చెట్లు చాలటం లేదు. అందుకే చెట్లు నాటండి అంటారు. కానీ, సైన్సు రాక ముందు ఈ ప్రక్రియలో  ఎందుకు ఆక్సిజన్ ఓడిపోయేది? అంటే సైన్సుకు  మించింది అప్పుడు వుండేది. అదే మంత్ర  శాస్త్రం తో మిళితం అయిన ధనుర్విద్య, ఆయుధ విద్య మొదలైనవి. వాటి వలన ఆక్సిజన్ ఓడిపోయేది. అప్పుడు చెట్లు నాటలేదు. యజ్ఞాలు చేసేవారు. ఎందుకంటె చెట్లు నాటడం అంటే స్లో ప్రాసస్. అందుకే యజ్ఞాలు చేసి త్వరగా ఆక్సిజన్ పైకి పంపే వారు. యజ్ఞాలు చేయమంటే ఈ కాలం ప్రజలు చేయరనే సాయిబాబా ధునిలను ఏర్పాటు చేసాడు. 
          చెట్లు వదిలే ఆక్సిజన్ జంతువులలో భాగమైన మనుషులకు చాలటం లేదు. ఎందుకు? జంతువుల్లాంటి  యంత్రాలను కనిపెట్టాడు మనిషి. వాటికే చాలటం లేదు అందుకే మనుషులకు అనారోగ్యాలు. కాబట్టి యంత్రాలను తగ్గిస్తే చెట్లు వదిలే ఆక్సిజన్ మనుషులకు సరిపోవచ్చు. కానీ, ఓజోన్ నిర్మాణానికి పైకి పంప లేము. దానికి నేయ్యితోనే కుదురుతుంది. కనుక అందుకని, యజ్ఞాలు విరివిగా చెయ్యాలి ఇండ్లలో అందరూ నూనె దీపాలు కాకుండా నెయ్యి దీపాలు వెలిగించాలి. TEAM కొన్ని ప్రత్యేకమైన పథకాలు ప్రవేశ పెట్ట బోతుంది.వివరాలు http://www.teambyindian.in లో చూడండి .
         అడవుల్లో చెట్లు వదిలే ఆక్సిజన్ను పీల్చడానికి జంతువుల్లేక చెట్లు సరిగ్గా పెరగలేక అడవులు తరుక్కు పోతున్నయి. అడవుల్లో జంతువులు ఎందుకు లేదు. అది మానవుని కల్పిత వైపరీత్యం. ఈ విషయాన్నీ గుర్తించడం లేదు చాలామంది.
          నగరాల్లో ,పట్టణాల్లో చెట్లు వున్నా అవి వదిలే ఆక్సిజన్ మనుషులకు జంతువులకు చాలటం లేదు. పైగా మనుషులు, జంతువులు, వదిలే Co2 + వాహనాల కాలుష్యం ఎంత కావాలో అంత పీల్చుకోగా మిగిలిన కాలుష్యం ఆకాశాన్ని చేరుతున్నది. అంటే పర్యావరణం (చెట్లు వదిలే ఆక్సిజన్) కు కాలుష్యం (జంతువులు వదిలే Co2 + వాహనాల కాలుష్యం + పారిశ్రామిక కాలుష్యం ) కు జరిగే ఆక్సిజన్ ఓడిపోయి ఆకాశం వైపు పోలేక పోతున్నది. అందుకే ఓజోన్ తయారు కావడం లేదు. పైగా ఆకాశం వైపు కాలుష్యం వెళ్లి ఓజోన్ పొరను దెబ్బ కొడుతుంది.  ఇది అధర్మం.
         TOTAL  గ ఆకాశాన్ని చేరుతున్నది ఆక్సిజన్ కానప్పుడు అక్కడ ఓజోన్ ఎలా తయారు అవుతుంది. ఆక్సిజన్ ఆకాశం చేరే మార్గం లేదా? వుంటే ఎలా? అప్పుడు ఓజోన్ పొరను కాపాడ వచ్చు. అదే ధర్మ పరాయణులు , సాయి సైనికులు చేయాల్సింది. 
           10 గ్రాముల నెయ్యితో టన్ను  ఆక్సిజన్ తయారు అనే విషయాని విశ్వసించిన వారు వెలిగే  నిరంతర నేయ్యిదీపాలు వెలిగించండి. చాలు. TEAM చేపట్టిన ఆ కార్యక్రమం గురించి http://www.teambyindian.in లో చూడండి.
          ఈ ప్రకారంగా ఆకాశం అనే పంచ భూతాన్నే కాకుండా వాయువు అనే పంచ భూతాన్ని కూడా కాపాడినట్లే అవుతుంది. 
-----------------------------------------------------------------------------------   
అనువుకానిచోట 
అధికులమనరాదు
          అధర్మం పెరగడం ప్రారంభం అయ్యింది. షిరిడీ సాయిబాబా అవతరణ జరిగింది. ఆయనను విశ్వసించిన వారు ఎందరో వున్నారు. అయితే అందరూ మూడం గా , అజ్ఞానం తోటి విశ్వసించారు. అప్పుడు షిరిడీ సాయిబాబా "నేనేమి చెప్పుచున్ననో గ్రహించువాడు ఒక్కడూ లేడు. " అని చెప్పారు. నిజంగా అయన చెప్పింది గ్రహించిన వారు ఉన్నట్లయితే, రాముడు, కృష్ణుడు లాగానే వివాహం చేసుకుని తన అవతారాన్ని సమాప్తం చేసి ఉండేవాడు. కనీ ధర్మ సంస్థాపన చేయలేకపోయాడు. ఎందుకంటె అయన చెప్పింది గ్రహించేశక్తి లేక పోయింది ప్రజలకు. మూడంగా ,అజ్ఞానంతోటి విశ్వసిస్తూ వచ్చారు. ఎందుకంటె అధర్మ పరాయణుల వాక్యాలు వారి కార్యక్రమాలు ప్రజలకు నచ్చింది. అందుకే "మళ్ళీ వస్తాను" అని చెప్పి వెళ్లి పోయారు. 
           పర్తి సాయి గా వచ్చారు.
 
                                                                  
--------------------------------------------------------------------------------------------------
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo
-------------------------------------------------------------------------------------------------

అతి సర్వత్ర వర్జయేత్ 
          అతి సర్వత్ర వర్జయేత్ అని ఎవరు అన్నారు. ఎప్పుడు అన్నారు. ఎందుకు అన్నారు. అది ఎప్పటికైనా వర్తిస్తుందా! అసలు అతి అంటే ఏమి? దానికి కొలత ఏమైనా ఉందా? ఎలాంటి  కొలమానంలో అయినా 0 నుండి 100 వరకు వుంటుంది. అందులో 50 అనేది బ్యాలన్సుడ్ అని చెప్పుతారు. దాన్నే నార్మల్ అని కూడా చెప్పుకుంటే 51 నుండి 60 అతి, 61 నుండి 70 వరకు ఉత్తమ అతి 71 నుండి 80 వరకు మధ్యమ అతి 81 నుండి 90 వరకు అధమ అతి 91 పైన ఉంటే ఏమి చెప్పాలో అర్థం చేసుకోండి. అలాగే 50 కంటే తక్కువ వున్నా కూడా సమస్యే. దాన్ని 50 లాక్కురావాలి. అంటే నార్మల్ వరకు లాక్కుని  రావాలి.
          సత్య సాయి బాబా చెప్పే వారు..... మనం వేసుకునే చొక్కా ,చెప్పు కరక్టు సైజులో వుండాలి. అంటే నార్మల్ సైజులో వుండాలి. ఎక్కువైనా, తక్కువైనా సమస్యే అని. అలాగే బాబా గారు చెప్పేవారు........ సముద్రంలో నీళ్ళు ఉప్పగా వుండి త్రాగటానికి ఎలాగైతే పనికిరాదో, ధనం కూడా నిల్వ వుంటే పదిమందికి ఉపయోగపడదు. ధనం పదిమందికి ఉపయోగపడాలంటే, నదిలో నీళ్ళ లాగా ప్రవహిస్తూ వుండాలి అని అనే వారు.           
       అయితే సముద్రంలో నీళ్ళు కూడా వైద్యానికి పనిచేస్తుంది. ఎలా.. సముద్ర స్నానం వలన అనేక జబ్బులు నయం అవుతుంది అని అంటారు. అలాగే అతిగా అంటే అవసరానికి మించి ధనం వున్నవారు లేని వారికీ పంచి బ్యాలన్సు చేయడం కూడా వైద్యమే. 
              డాక్టర్లు చెపుతూ వుంటారు B .P ., SUGAR , లాంటి అనేక మైనవి  నార్మల్ గా లేకపోతే B .P .వుందని, SUGAR వుందని అంటారు అంటే నార్మల్  కి మించి వుంటే జబ్బుక్రిందకు వస్తుంది. 
               ఇలాగ అన్ని విషయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో నార్మల్ కు మించితే అంటే అతి అయినా, మధ్యమ  అతి అయినా, అధమ అతి అయినా జబ్బే.
               ప్రేమ, జాలి, దయ, అనురాగం లాంటి గుణాలు  వుండాలి. కాని అతిగా వుండకూడదు. దాని వలన కూడా సమస్యే.
           మానవాభి వృద్ధిలో 60 వసంతాల గణతంత్ర భారత్ సాధించిన ప్రగతి అనన్య సామాన్యం...... అంటూ చాలా వ్రాసారు. 26 -1 -2010 న ఈనాడు  దినపత్రికలో. అది వారి తప్పుకాదు. అది ఒక వార్త. ప్రచురించారు. ఇంకా వివరాల్లోకి వెళ్ళితే ....... లక్ష మంది ప్రజలకు ఆనాడు 16 మంది వైద్యులు వుండేవారు. ఈనాడు ఆ సంఖ్యా  60 మందికి చేరింది అని వ్రాసారు.
             1950 లో 1 ,00 ,000 మందికి 16 డాక్టర్లు వున్నప్పుడు . . . .  ఉదా||కు 1 ,00 ,000 /16 =6 ,250 మంది పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  రోజుకు 8 గం|| ప్రాక్టీసు చేస్తే అందులో గంటకు 4 చొప్పున పరీక్ష చేస్తే 32 మందికి పరీక్ష చేయవచ్చును. ఆ ప్రకారముగా నెలకు 32 x 30 = 960 మందికి అంటే సుమారు నెలకు 1 ,000 మందికి పరీక్ష చేయవచ్చును. ఈ 1 ,000  మంది ప్రతి నెలా పేషంట్ల రూపంలో రాగలరా? రాలేరు. పోనీ, ప్రతి 6 నెలలకు ఒకసారి రాగలరా? వచ్చారు అనుకుందాం. అంటే ఒక్కొక్క డాక్టరుకు 6 ,000 మంది పర్మనెంటు పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ.2010  కి 60  మంది డాక్టర్లు ఉండేలా ప్రగతి సాధించింది అని అంటున్నారు. 
            అంటే మన దేశ జనాభాకు (1 ,30 ,00 ,00 ,000 /1 ,00 ,000 x 60 = 7 ,80 ,000 డాక్టర్లు  వున్నట్లు లెఖ్ఖ. ) అంటే ఉదా||కు 1 ,00 ,000 /60 = 1 ,600  మంది పేషంట్లు  ఒక్కొక్క డాక్టరుకు  వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  (రోజుకు 8 గం|| ప్రాక్టీసు చేస్తే ) 1 ,000 మంది పేషంట్లు కావాలి. ఈ లెక్కన పేషంట్లు కనీసం రెండు నెలలకు ఒకసారి వచ్చి తీరాలి?  ఎందుకంటె డాక్టర్లు అతి వున్నారా? మధ్యమ అతిగా వున్నారా ? ఏ లెవెల్ లో అతిగా వున్నారో ఆలోచించండి !
       ఎందుకంటె . . . . . అవసరానికి మించిన డాక్టర్లు వుంటే ప్రగాతా? పతనానికి నాందియా? ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు. 
         ఈ ప్రకారంగా అన్నిరకాల (వైద్య) పాత కుల వృత్తులలోనూ, కొత్త రకం కుల వృత్తులలోనూ, అవసరానికి మించి వున్నారు. అందుకే లాభాల కోసం వ్యాపారస్తులు  తయారుచేసిన వస్తువుల విషయంలోనూ, బట్టల విషయం లోనూ, ఒకటి కొంటె ఒకటి ఉచితం అంటున్నారు. వారికి నష్టాలు రాకుండా ప్రభుత్వం ప్యాకేజీలు యిస్తుంది. డాక్టర్లకు నష్టాలు రాకుండా ఆరోగ్య శ్రీ పథకం అనే పేరుతో నడుపుతున్నారు. ఇది ఎంత కాలం? డాక్టర్లను శాశ్వతంగా ఆరోగ్య శ్రీ పథకంలో పోషించాలంటే ప్రజలకు జబ్బులు ప్రతి సంవత్సరం రావాలి.  అలాగే ఎన్నో పథకాల కోసం ప్రజలు యిబ్బందులకు గురి కాక తప్పదు.  ఈ అతిగా వున్నాడు వలెనే ఆర్థిక సంక్షోభం. 
            ముఖ్య మంత్రులు కు కావలసిన అర్హతలు వున్నవారు (అతిగా ) ఎక్కువగా వున్నారు కనుకే  చిన్న రాష్త్రాలు కావాలని కోరుకుంటున్నాము .
            అంతే కాదు ఎం.పి. లు అయ్యే  అర్హతలు వున్నవారు (అతిగా) ఎక్కువ గా వున్నారు కనుకే ఆంధ్రలో లోక్ సభ స్థానాల సంఖ్య పెంచాలని కోరుకుంటున్నాము. 
         భవిష్యత్తులో ప్రధాన మంత్రులు కు కావలసిన అర్హతలు (అతిగా) ఎక్కువగా వుంటే గ్యారంటీగా భారత దేశం రెండు ముక్కలుగా కూడా అవుతుంది.  ఇదంతా ఎందువలన? అతిగా ఉన్నందుకే ...........అంటే అవసరానికి మించి వుంటే తప్పదు అనేక సమస్యలు.
       ఇలా ఎందుకు జరుగుతున్నదంటే మనం భారతీయ సంస్కృతిని, విద్యా విధానాన్ని మరచి, మెకాలే విద్యా విధానాన్ని,విదేశీ సంస్కృతిని నమ్ముకున్నందుకే .ఆలోచించండి మేధావుల్లరా!
         అలాగే మన ఆదాయం , ఖర్చులు, కూడా... నార్మల్ గా వుండాలి. 
           ఒకప్పుడు....ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కరి మీద ఆధారపడి ఉంటుంది ఆదాయం ,ఖర్చులు. కుటుంబంలో ఎంతమంది వున్నా అందులో ఎంతమంది సంపాదనాపరులో, ఎంతమంది సంపాదించ లేని వారో (వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా), అందరికీ సమానం గా కుటుంబ పెద్ద ఒకరు బాలన్సు చేసే వారు.భవిష్యత్తులో కుటుంబం ఎంత పెద్దది అవుతుందో తెలీదు అన్నట్లుగా, క్రింది తరాల వారికోసం కూడా సంపాయించి దాచేవారు. అది ధర్మం. అప్పుడు అతిగా సంపాయిస్తున్నారు అనేదానికి తావు లేదు. కానీ, మెకాలే విద్యా విదానం లో పడి భారతీయ ఉమ్మడి సంప్రదాయాలను మరచిపోయారు. నేను ఏమి చెప్పుచున్నానో చాలామందికి అర్థం కాదు. 
          ఉమ్మడి కుటుంబాలను చిన్న కుటుంబాలుగా , ఆ చిన్న కుటుంబాలను విడాకుల పేరుతో వ్యక్తి కుటుంబాలుగా తయారు చేసారు కొందరు. దాన్ని ఎక్కువ మంది ఆచరిస్తున్నందు  వలన యిప్పుడు అదే ధర్మం అని అనుకుంటే వ్యక్తి కుటుంబాలకు క్రింద తరం తో సంబంధం లేదు కదా! అలాంటప్పుడు ఒక వ్యక్తి తన వరకు ఎంత కావాలో అంత సంపాయించడం ధర్మం. అంతకంటే (అతిగా) ఎక్కువ సంపాయించడం అధర్మం. దాని వలనే సమస్యలు.  కాబట్టి సంపాదన (అతిగా) ఎక్కువగా వున్నవారు అంటే
          ఉదా: ఒక వ్యక్తి 1000 నెలలు బ్రతుకుతాడంటే, నెలకు ఎంత ఖర్చు కావాలో అంత x 1000  నెలలు సంపాయిస్తే చాలు. అలాంటి వారంతా  యోగా వైపు మరలండి. Maximum సమయం యోగాలో వుండండి. ఎవరూ దర్శించలేని వాటినంతా దర్శించండి. దర్శించిన దాన్ని పది మందికి చెప్పండి. దిన చర్యలో మార్పు తీసుకు రండి.  కేవలం ఆకలైనప్పుడు ఆహారం మిగిలిన సమయం యోగ, ధ్యానం లో వుండండి. ఇలాంటి వారె మహర్షులు, యోగులు, గంధర్వులు, వగైరా.. వగైరాలు. అవసరానికి మించి వుంటే చేస్తున్న ఉద్యోగానికి విరమణ చెప్పండి. యోగ, ధ్యానం వైపు మారండి సాయి సైనికులారా! మీ స్థానంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది. ఎందుకంటె వ్యక్తి కుటుంబ సమాజంలో మీ భార్య అనే జీవి  కూడా సంపాయిస్తుంది కదా . అలాగే మీ పిల్లలు అనే జీవులకు మీరే అవకాశం యివ్వాలి. 
         అలాగే 1000 నెలలు బ్రతకడానికి ఒక ఇల్లు (గూడు) చాలు. మీకు మరొక ఇల్లు (అతిగా) వుంటే అమ్మేయండి. ఎందుకంటె ప్రభుత్వం అన్ని వ్యక్తి కుటుంబ జీవులకు విడివిడిగా ఇళ్ళు కట్టిస్తున్నారు అలాంటప్పుడు మీ యింటికి అద్దెకు ఎవరూ రారు . అలాంటప్పుడు ఆదాయం లేని ఆస్థి కదా! మీ అబ్బాయికి అంటారా! వ్యక్తి కుటుంబ సమాజంలో మీ అబ్బాయికి   ప్రభుత్వం కట్టిస్తుంది. లేదా మీ యింట్లోనే వుంటాడు. ఎందుకంటె, మీలా యోగ ధ్యానంలో వుండే వారంతా ఒక చోట చేరుతారు కదా! అదే ఆశ్రమం. ప్రస్తుతం పార్ట్ టైం గా వున్నా భజన మండళ్ళు, సాయి దేవాలయాలు ఫుల్ టైం ఆశ్రమాలుగా మార్చుకోండి.
         ఎంత  అవసరమో అంత వుండటం వలన మీరు ధర్మాన్ని పాటించినట్లు అవుతుంది. అదే సమయంలో త్వరగా మీరు విరమణ చేసినందువలన మరొకరికి ఉద్యోగ అవకాశం. మీరు ఫుల్ టైం ఆశ్రమవాసిగా యోగ ధ్యానం లో ఉన్నందు వలన స్వంత వాహనాలకు స్వస్తి పలుకుతారు అంటే కాలుష్యాన్ని నిరోధించినట్లే....యిలా ఎన్నో రకాలుగా కాలుష్యాన్ని, పర్యావరణాన్ని(ప్రకృతి)  బాలన్సు చేయవచ్చును. అంటే ధర్మ సంస్థాపనలో మీరు పాల్గొన్నట్లే, ధర్మ సంస్థాపన జరుగుతున్నట్లే. అంటే యిక్కడ అతిగా వున్న దాన్ని నార్మల్ గా  చేస్తున్నాము.
         యిదంతా సాయి భక్తులే, సాయి సేవకులే  ఎందుకు చేయాలి?  అంటే ధర్మ సంస్థాపనలో మీరంతా భాగస్తులు కావాలి. మీరంతా రామాయణంలోని వానర సైన్యం, కృష్ణావతారం లోని గోపాలురు  కాబట్టి. ధర్మ సంస్థాపనలో పాల్గొన్నవారే సాయి సైనికులు. మిగిలినవారంత సాయి భక్తులు, సాయి సేవకులు. పాండవ పక్షంలో ఉన్నవారంతా శ్రీకృష్ణుని భక్తులు, సేవకులు, శ్రీకృష్ణుని సైన్యం అంటే గోపాలురు. వారంతా దుర్యోధనుని పక్షంలో వున్నారు. ఆ ప్రకారం గ సాయి సైనికులు వేరు. సాయి భక్తులు వేరు. 
      ఒకవేళ మీకు 1000 నెలలుకు కావలసిన ఆదాయం లేకున్నా సాయి సైనికులుగా మరి యోగ ధ్యానం ఆశ్రమజీవితంలో వుంటే ( LOW B P ., LOW SUGAR మాదిరి ) అయిన సరే దాన్ని నార్మల్గా చేయడానికి సాయి వున్నాడు. ఎందుకంటె మీరు ధర్మ సంస్థాపనలో పాల్గొంటున్న సాయి సైనికులు కదా !
         కుక్క - గాడిద కథ ను చాల మంది వినే వుంటారు. అది ధర్మం. కుక్క పని (వృత్తి) కుక్క చేయాలి. గాడిద పని (వృత్తి) గాడిద చేయాలి. అదే ధర్మం గాడిద ధర్మం  తప్పింది. యజమాని దగ్గర నడ్డి విరుచుకుంది. విన్నారు కదా! అలాగే మానవుని ధర్మం మాత్రమే మానవుడు చేయాలి. మానవుని ధర్మాలు ఏమిటి? ఎన్ని రకాలు? అవి ఎన్నో? అందులో వృత్తి ధర్మం చెప్పుకుందాం. డాక్టరు తన వృత్తి తప్ప మరొక వృత్తి వైపు కన్నెత్తి చూడకూడదు. ఉపాద్యాయుడు తన వృత్తి తప్ప మరొక వృత్తి వైపు కన్నెత్తి చూడకూడదు. JUST LIKE కుక్క గాడిద కథలో మాదిరి. అక్కడ యజమాని గాడిద నడ్డి విరిచాడు. మానవుల్ని ఎవరు విరుస్తారు అని అందరూ అనుకుంటారు? అందుకే ధర్మాన్ని తప్పుతున్నారు. మన యజమాని భగవంతుడు. 
           మానవుడు అనే  యజమాని పాత్ర వేసి గాడిద నడ్డి విరిచాడు. కానీ, భగవంతుడు అనే యజమాని దయామయుడు కరుణామయుడు. అయన దయను కరుణను అందుకున్నవారంతా తెలిసో తెలియకో తమ వృత్తి తో పటు మరొక వృత్తిని చేపట్టి వుంటే దాన్ని వదిలినట్లైతే వారంతా సాయి  సైనికులే. సాయి భక్తులు సాయి సేవకులు అందరూ ఒకే వృత్తిని అంటి పెట్టుకుని మిగిలిన వృత్తులను ప్రక్కన పెట్టి సాయి సైనికులు గా మారితే అదే ధర్మ సంస్థాపన.
---------------------------------------- 

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...