Sunday, March 18, 2012

అర్థం చేసుకోండి ప్లీజ్..........

          గాడిద కాగితాలు తింటుందని అందరికీ తెలుసు. కానీ ఎందుకు  అని తెలుసా? అదే చెప్తున్నాను. గాడిద కూడా ముందు మానవుని లాగా ఆకులూ అలములు తినేది. ఒక్క గాడిద ఏంటి? అన్ని జంతువులూ (మానవుడు అనే జంతువుతో సహా) ఆకులూ అలములు తినే వారు. అందరు ఆరోగ్యంగా వుండేవారు. అయితే సైన్సు అభివృద్ధి కావడంతో మానవునికి తెలివి ఎక్కువై ఆకులూ అలములు వండుకుని తినడం నేర్చుకున్నాడు.  దాంతో జంతువు తో సమానమైన మానవుడు అనే వాడు జంతువుల సెక్షన్ నుండి వేరు పడ్డాడు. మానవుడు అని పిలిపించుకున్నాడు. అర్థం చేసుకోండి ప్లీజ్..........
           అప్పుడు మానవులలో కొందరికి భూత దయ, సేవ, ప్రేమ యిలాంటివి కలిగిన వారు తమకు వండుకున్న పదార్థాలను తమ పెంపుడు జంతువులకు పెట్టేవారు ఉదా || కు మనకు ఉపయోగ పడే జంతువులకు అంటే పిల్లికి, కుక్కకు, గాడిదలకు, అవుకు, లాంటి వాటికీ యింకా కొందరు పక్షులకు కూడా పెట్టేవారు. వారే దేవతలు అయ్యారు . కేవలం భూత దయ, ప్రేమ ఇవి రెండు వుండే చాలు. మనం కూడా దేవతలే.
         సైన్సు యింకా పెరిగింది. దాంతో పాటు కాలుష్యం పెరిగింది. మానవులకే ఆహారం దొరకలేదు. కాబట్టి ఏ జంతువుకు పెట్టక పోగా మళ్లీ back  to pevilion అన్నట్లు ఆకులూ అలములు కు వచ్చారు. అంతే మిగిలిన జంతువులు గడ్డి తినటం జరిగింది. అప్పుడు గాడిద కూడా గడ్డి తినేది. కాలుష్యం తగ్గి మళ్లీ ఆహారం వండుకునే మాదిరి పరిస్థితి వచ్చింది కానీ, ఈ సారి మానవుడు దేవత అయితే మళ్లీ తనకు కష్టమని జంతువులకు వండినది పెట్టడం మానేసారు. అంతే  దేవతల % తగ్గింది. కొందరే వండింది పెడుతున్నారు. దాంతో కొన్ని జంతువులు కుక్క, పంది యిలాంటివి పెంట తినడం నేర్చుకుంది. గాడిద గడ్డి తినేది. ఇప్పుడు పందులకు చక్కగా దుంపలు పెట్టి పోషిస్తున్నరులే ఎందుకంటే కోసుకుని తినడానికి. మళ్లీ కాలుష్యం పెరుగుతుంది. మళ్లీ  సమస్యలు. యిది చక్ర భ్రమణం. అయితే ఒక్కక సారి కాలుష్యం పెరగటానికి  ఒక్కొక రకం కారణం. దాన్ని యింకా సైన్సు కనిపెట్టలేదు. 
          ఈసారి సైన్సు పేపరు కనిపెట్టింది. గడ్డికి పోటి వుంది. పేపరుకు పోటి లేదు. తెలుసుకున్నాడు మానవుడు జంతువులకు అలవాటు చేసాడు. కానీ ముందుగా అర్థం చేసుకుంది  గాడిద. అలవాటు చేసుకుంది. అందువలన గాడిద పేపరు తింటుంది అని తరువాత తరం, అంటే మనందరికీ  వారికీ తెలిసింది. అయితే ఈ మధ్య  కాలుష్యం మరింత ఎక్కువైంది కదా! కాబట్టి ఆవులు గేదలు లాంటి జంతువులు  కూడా పేపరు ప్లాస్టిక్ ను తింటున్నాయి. కాలుష్యం తో నిండిన నీళ్ళును త్రాగుతున్నాయి.
           అయితే మానవుడు జంతువునుండి వేరు పడ్డాడు కాబట్టి, నీళ్ళను కొన్నుకుని త్రాగుతున్నాడు. కానీ సైన్సు ను పెంచుకోవడమే కదా పని.
          కాబట్టి నీళ్ళు కొనుక్కుని  త్రాగుతు, ఇంటర్నెట్ చాటింగ్ లో  మునిగి పోతున్నాడు. డబ్బిచ్చినా, నీళ్ళు  దొరొక లేదనుకోండి. నో ప్రాబ్లం. గాడిద గడ్డికి బదులు పేపరు, ఆవు ప్లాస్టిక్ తిన్నట్లుగా మానవుడు పెట్రోల్, కెరోసిన్, లేదంటే  తన మూత్రం కూడా త్రాగవచ్చును..  పైగా గో మూత్రం ఆరోగ్యకరం అంటున్నారు గా. భవిష్యత్తు తరానికి అంటే మన మనవలకు నీరు దొరక్క పోతే కష్ట  పడకుండా యిప్పట్నుంచే  ప్రజలకు అలవాటు చేస్తున్నారు.


                     పర్యావరణను దెబ్బ తీయడమే  కలియుగాంతం.
                  ప్రకృతిని గుప్పిట బంధించమే కలియుగాంతం 
                  పర్యావరణ పరి రక్షకులే దేవతలు  
                 పర్యావరణ భక్షకులే రాక్షసులు 
                 తటస్తులే మానవులు. ఏ జాతిలో మీరు 
                 వుండదల్చుకుంటారో  ఆలోచించుకోండి  ప్లీజ్..........
                     మూడో ప్రపంచ యుద్ధం మొదలైయ్యింది . 
                     కత్తులతో కాదు, బాంబులతో కాదు, 
                     కరెన్సిలతో యుద్ధం మొదలైయ్యింది. 
                     పర్యవసానం .......కాలుష్య ప్రేమికులు  పెరుగుతారు. 
                                               పర్యావరణ ప్రేమికులు తగ్గుతారు. 
                                              చెత్తను మరింత సృష్టిస్తారు. 
                                              జబ్బులనే ఆస్తిని పెంచుకుంటారు. 
                   తప్పదు కదా! రీ సైక్లింగ్ కంపెనీలు, ఫార్మస్యుటికల్ కంపెనీలు, 
                   కాబోయే డాక్టర్లు బ్రతకడానికి అదొక మార్గం కదా.

         

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...